పట్టుదలకు ప్రతిరూపం.. కాళ్లు లేకున్నా డాక్టర్ అయ్యింది
దిశ, వెబ్ డెస్క్: కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని ఓ సినిమా రచయిత రాసిన పాట మీకు గుర్తుందా. ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఈ పాట ఇప్పటికి, అందరికి సుపరిచితమే. అయితే.. ఈ పాటను ఇప్పుడెందుకు గుర్తుకు చేస్తున్నానంటే ఇది అక్షరాల నిజమని నిరూపించింది ముంబైకి చెందిన ఓ యువతి. తాను రైలు ప్రమాదానికి గురై రెండు కాళ్లు పోయినా, పరిస్థితులు అనుకూలించకున్నా కూడా ఏనాడు అధైర్యపడలేదు. అనుకున్నట్టుగానే డాక్టరయ్యి ఇప్పుడు ఇతరులకు ఆదర్శంగా […]
దిశ, వెబ్ డెస్క్: కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని ఓ సినిమా రచయిత రాసిన పాట మీకు గుర్తుందా. ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఈ పాట ఇప్పటికి, అందరికి సుపరిచితమే. అయితే.. ఈ పాటను ఇప్పుడెందుకు గుర్తుకు చేస్తున్నానంటే ఇది అక్షరాల నిజమని నిరూపించింది ముంబైకి చెందిన ఓ యువతి. తాను రైలు ప్రమాదానికి గురై రెండు కాళ్లు పోయినా, పరిస్థితులు అనుకూలించకున్నా కూడా ఏనాడు అధైర్యపడలేదు. అనుకున్నట్టుగానే డాక్టరయ్యి ఇప్పుడు ఇతరులకు ఆదర్శంగా నిలిచింది.
వివరాల్లోకి వెళితే.. రోషన్ జవ్వాద్ అనే యువతి ముంబైలోని జోగేశ్వరికి చెందిన నివాసి. ఈ యువతి తండ్రి కూరగాయలు విక్రయిస్తాడు. నలుగురు తోబుట్టువులో ఈమె ఒకరు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం వాళ్లది. అయితే.. ఈ యువతికి డాక్టర్ కావాలని కోరిక. కానీ, 2008లో రైలు ప్రమాదానికి గురై తన రెండు కాళ్లు కోల్పోయింది. అయినా కూడా తాను ఏనాడు కూడా ధైర్యం కోల్పోకుండా ఎంతో కష్టపడి చదివి ఆమె అనుకున్నట్టుగానే డాక్టరవ్వగలిగింది.
అయితే ఈ సమయంలో ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నది. అయినా కూడా ఏ రోజు వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తూ 2016 లో ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించింది. ఆ తర్వాత ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి MD లో చేరింది. ఇందుకు సంబంధించిన ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఆమె తన విభాగంలో 4వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “తనకు పరిస్థితులు సహకరించకపోయినా ఏనాడు కూడా అధైర్యపడకుండా ముందుకెళ్తూ డాక్టర్ అవ్వగలిగానని, పాథాలజీలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ డిగ్రీని పూర్తి చేసే విషయంలో తనకు చాలామంది సహకరించారని ఆమె చెప్పింది. ఒక డాక్టర్ గా తాను నిరుపేదలకు సేవలందిస్తానని” ఆమె పేర్కొన్నది