నీటమునిగిన విద్యుత్ సబ్ స్టేషన్.. పరిశీలించిన మంత్రి
దిశ, నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యనగర్‌లో గల భీమన్నగుట్ట సమీపంలో నీటమునిగిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులతో మాట్లాడారు. సబ్ స్టేషన్ నుండి నీటిని బయటకు పంపే పునరుద్ధరణ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, కౌన్సిలర్లు పూదరి రాజేశ్వర్, శ్రీకాంత్, టీఆర్ఎస్ పార్టీ […]
దిశ, నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యనగర్‌లో గల భీమన్నగుట్ట సమీపంలో నీటమునిగిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులతో మాట్లాడారు. సబ్ స్టేషన్ నుండి నీటిని బయటకు పంపే పునరుద్ధరణ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇందులో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, కౌన్సిలర్లు పూదరి రాజేశ్వర్, శ్రీకాంత్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మారుగొండ రాము, నాయకులు శ్రీధర్, మాజీ డీసీసీబీ అధ్యక్షులు రామ్ కిషన్ రెడ్డి తదితరులున్నారు.