మహారాష్ట్రలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
ఈనెల 20వ తేదీన జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ తో జత కట్టిన కూటమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
దిశ,భైంసా : ఈనెల 20వ తేదీన జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ తో జత కట్టిన కూటమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాందేడ్ జిల్లా ధర్మాబాద్ రోడ్ షోలో హాజరై మాట్లాడారు. తుపాకి తూటాలకు ఎదురెల్లి స్వతంత్య్రం సాధించి పెట్టింది గాంధీ కుటుంబమేనని, దేశ సమగ్రత, కీర్తిని కాపాడిన ఘనత కాంగ్రెస్ దని అన్నారు. 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ పేదలకి ఇందిరమ్మ ఇండ్లు లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమలు చేపట్టిందని తెలిపారు.
ముందుగా అనుకున్నట్టు కాంగ్రెస్ నయగావ్ అసెంబ్లీ అభ్యర్థి గా డాక్టర్ మినల్ పాటిల్ కథ్ గాన్ కర్ రోడ్డు షో ప్రచార కార్యక్రమానికి రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా హెలికాఫ్టర్ ఎగరడానికి బీజేపీ ఇబ్బంది పెట్టిన కారణంగా హాజరు కాలేకపోయారని చెప్పారు. ఈ రోడ్డు షో చత్రపతి శివాజీ చౌక్ నుండి నయాముండే (గంజ్), సాయిబాబా చౌక్, నరేందర్ చౌక్, నటరాజ్ టాకీస్ వరకు సాగింది. ఈ రోడ్డు షో కి రేవంత్ రెడ్డి వస్తున్నారని సమీప తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ముందుగా హాజరుకాగా చివరి క్షణంలో రారని తెలుసుకొని నిరాశ చెందారు. అయితే గెలిచాక ధర్మబాదు వచ్చి దావత్ చేసుకుందామని రేవంత్ తెలిపినట్టు పోటీ అభ్యర్థి మినల్ పాటిల్ ప్రజలకు తెలిపారు.