మోహన్ బాబు విద్యానికేతన్ ఎదుట విద్యార్థుల ధర్నా..
దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టారు. కాలేజ్ లో 150 మందికి కరోనా వచ్చినా, కరోనా వలన ఒక లెక్చరర్ మృతి చెందినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని, ఇలాంటి సమయంలో కూడా పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచిస్తుందని తెలిపారు. వెంటనే కాలేజ్ ని మూసివేసి పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. సినీ నటుడు మోహన్ బాబుకి చెందిన శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ […]
దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టారు. కాలేజ్ లో 150 మందికి కరోనా వచ్చినా, కరోనా వలన ఒక లెక్చరర్ మృతి చెందినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని, ఇలాంటి సమయంలో కూడా పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచిస్తుందని తెలిపారు. వెంటనే కాలేజ్ ని మూసివేసి పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
సినీ నటుడు మోహన్ బాబుకి చెందిన శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఒక లెక్చరర్ కరోనా వల్ల చనిపోయినా, 150 విద్యార్థులకు కరోన వచ్చినా కళాశాలలో తరగతులు నిర్వహిస్తూ…కరోన వచ్చిన వారిని కూడా పరీక్షలకు హాజరు అవ్వాలని కళాశాల యాజమాన్యం చెప్పడం అత్యంత దారుణం, అమానవీయం.(1/2) pic.twitter.com/5kSheu48EW
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) April 26, 2021
కరోనా వచ్చినా కూడా వారిని పరీక్షలకు హాజరు కావాలని కళాశాల యాజమాన్యం చెప్పుతోందని విద్యార్థులు ఆరోపించారు. ఇప్పటికే హాస్టల్లో కూడా చాలా కేసులు ఉన్నాయని, ఎవరూ పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ర్యాలీ తీస్తున్నారని వారు తెలిపారు. అంతేకాకుండా తాము ఎండలో కూర్చొని నిరసన తెలుపుతున్న యాజమాన్యం ఏమి పట్టనట్టు తరగతులు నిర్వహిస్తుందని, తమకు న్యాయం జరిగే వరకు తాము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.