విద్యాశాఖ మంత్రి ఇలాకాలో ఉన్నత విద్య లేదు
దిశ, వెబ్‌డెస్క్: మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్, కోఠి తదితర ప్రాంతాలే కాకుండా ఇబ్రహీంపట్నం, శంషాబాద్ ప్రాంతాలకు విద్యార్థులు తరలి వెళ్తున్నారు. నియోజకవర్గంలోని సుమారు 30 గ్రామ పంచాయతీల్లో డిగ్రీ చదువుకునే విద్యార్థులు సుమారు 3వేల మంది ఉన్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతోంది. […]
దిశ, వెబ్‌డెస్క్: మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్, ఐఎస్ సదన్, కోఠి తదితర ప్రాంతాలే కాకుండా ఇబ్రహీంపట్నం, శంషాబాద్ ప్రాంతాలకు విద్యార్థులు తరలి వెళ్తున్నారు. నియోజకవర్గంలోని సుమారు 30 గ్రామ పంచాయతీల్లో డిగ్రీ చదువుకునే విద్యార్థులు సుమారు 3వేల మంది ఉన్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతోంది. మహేశ్వరం, కందుకూరు మండలాలకు చెందిన విద్యార్థులు స్థానికంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడంతో సమీప పట్టణాలకు వెళ్తున్నారు. సుమారు 35 కిలోమీటర్లు ప్రతీ రోజు ప్రయాణం చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు.
జర్నీకే సగం టైం..
చదువుల కోసం ఉదయం 6 గంటలకు బయలుదేరితే మళ్లీ ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం 6 గంటలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జర్నీకి 4గంటల సమయం కేటాయించాల్సి వస్తుందంటున్నారు. మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని కొన్ని గ్రామాలు, తండాలకు ఉదయం వేళ ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో బైకులు, ప్రైవేట్‌వాహనాల్లో మండల కేంద్రానికి చేరుకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని పలువురు విద్యార్థులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక విద్యార్థినిల తల్లిదండ్రులు సుదూర ప్రాంతాలకు పంపలేక చదువు మధ్యలోనే మానేయిస్తున్నారు. దీంతో పలు విద్యార్థినులు ఇంటర్ వరకే చదవాల్సి వస్తోంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రం అందజేసినా ఫలితం లేదు. మంత్రి ఇలాఖాలోనే పరిస్థితి ఇలా ఉందని, విద్యాశాఖ మంత్రిగా నియోజవకర్గానికి కనీసం డిగ్రీ కాలేజీ మంజూరు చేయించలేకపోయారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇంటర్వరకే చదువు: మునావత్ దేవేందర్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
మహేశ్వరం నియోజకవర్గం కేంద్రం లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేక కందు కూరు, మహేశ్వరం మండలాకు చెందిన 2వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆడపిల్ల లు ఇంటర్ వరకే చదువుతున్నారు. కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.
మంత్రి ఇలాఖాలో: కుమార్, ఎస్ఎఫ్ఐ నియోజకవర్గ కార్యదర్శి
విద్యాశాఖ మంత్రి, జెడ్పీ చైర్ పర్సన్ ప్రా తినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడం బాధాకరం. విద్యార్థులు హైదరాబాద్, శంషా బాద్, ఇబ్ర హీంపట్నం వెళ్తున్నారు. వచ్చే అకాడమిక్ నాటికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి.
జర్నీకే 4గంటలు: చుక్క శివ, విద్యార్థి, ధన్నారం గ్రామం
నేను హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో అంబేద్కర్ కాలేజీలో బీఏ ఫైనల్ ఇయర్ చదవుతున్నా. ఉదయం 6గంటలకు వెళ్తే ఇంటికి తిరిగి వచ్చేసరికి సాయంత్రం 6
అవుతుంది. జర్నీకే 4గంటల సమయం పడుతుంది.
ఇబ్బందులు తప్పడం లేదు: నందిని, విద్యార్థిని
నేను హైదరాబాద్‌లోని దిల్ సుఖ్‌నగర్ లోని శ్రీ సాయి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సెంకడ్ ఇయర్ చదువుతు న్నా. నియోజకవర్గంలో డిగ్రీ కాలే జీ లేక అమ్మాయిలు ఇంటర్ వరకే చదువుకుంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు దూరప్రాంతాలకు పంప డం లేదు.