రేపటి నుంచి కఠినంగా లాక్‌డౌన్: డీజీపీ

దిశ, వెబ్‌డెస్క్: రేపటి నుంచి లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల కోసం పాస్‌లు ఇస్తే కొందరు మిస్ యూజ్ చేస్తున్నారని, ఇప్పటినుంచి టైమింగ్ ప్రకారం కొత్తపాస్‌లను ఇస్తామన్నారు. ఇచ్చిన రూట్లో కాకుండా వేరే రూట్‌లో వెళ్తే పాస్ రద్దు చేస్తామని తెలిపారు. కొత్త పాస్‌లు వచ్చే వరకు పాత పాసులు చెల్లుబాటు అవుతాయని, నిత్యావసరాలకు బయటకు వెళ్లేవారు 3 […]

Update: 2020-04-20 08:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: రేపటి నుంచి లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల కోసం పాస్‌లు ఇస్తే కొందరు మిస్ యూజ్ చేస్తున్నారని, ఇప్పటినుంచి టైమింగ్ ప్రకారం కొత్తపాస్‌లను ఇస్తామన్నారు. ఇచ్చిన రూట్లో కాకుండా వేరే రూట్‌లో వెళ్తే పాస్ రద్దు చేస్తామని తెలిపారు. కొత్త పాస్‌లు వచ్చే వరకు పాత పాసులు చెల్లుబాటు అవుతాయని, నిత్యావసరాలకు బయటకు వెళ్లేవారు 3 కిలో మీటర్ల లోపే కొనుక్కోవాలని సూచించారు. సరుకులు కొనేందుకు బయటకు వచ్చే ప్రతి ఒక్కరు అడ్రస్ ప్రూప్ తీసుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లపైకి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులే వస్తున్నారని, ఇకనుంచి వారికి రోజువారిగా కలర్ కోడ్ ఇస్తామన్నారు. ఆస్పత్రికి వెళ్లేవారు ఇంటి అడ్రస్‌తో వెళ్లాలని, సాధారణ చికిత్స అయితే దగ్గర్లోని ఆస్పత్రులకే వెళ్లాలని సూచించారు.

అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న లక్షా 21వేల వాహనాలను సీజ్ చేశామని, లాక్‌డౌన్ పూర్తయ్యాక కోర్టు ద్వారా తిరిగి తీసుకోవచ్చన్నారు. ఫుడ్ డిస్టిబ్యూషన్ చేసే సమయంలో సోషల్ డిస్టెన్స్ ఉండేలా జాగ్రత్తపడాలన్నారు. సూపర్ మార్కెట్ల వద్ద సమస్యలు తలెత్తితే సీజ్ చేస్తామన్నారు. పోలీసులు, ప్రభుత్వానికి కాలనీ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్‌లు సహకరించాలని, ఒకే ఎంట్రీ- ఎగ్జిట్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. కంటైన్మెంట్ ఏరియాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నామని, రోజువారి టెస్టుల్లో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. హైదరాబాద్ నుంచి ఐదుగురు, నల్గొండ నుంచి నలుగురు మర్కజ్‌కు వెళ్లిరాగా వారందరినీ ట్రేస్ చేశామని, అందరికీ టెస్టులు జరిగాయని చెప్పారు.

tags: Telangana DGP, Mahender Reddy, Press Meet, Lockdown, Coronavirus, Containment Areas, Police

Tags:    

Similar News