టీటీడీపీ ని బలోపేతం చేయండి..
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతి కార్యకర్త ప్రజలకు వద్దకు వెళ్లి టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధి వివరించాలని తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపు నిచ్చారు. బుధవారం ఎన్టీఆర్ భవన్ లో చేవేళ్ల పార్లమెంట్ లోని నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్ధాయి నుంచి పార్టీని బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ఉద్యమించాలని సూచించారు. చేవేళ్ల […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతి కార్యకర్త ప్రజలకు వద్దకు వెళ్లి టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధి వివరించాలని తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపు నిచ్చారు. బుధవారం ఎన్టీఆర్ భవన్ లో చేవేళ్ల పార్లమెంట్ లోని నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్ధాయి నుంచి పార్టీని బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ఉద్యమించాలని సూచించారు. చేవేళ్ల పార్లమెంట్ అధ్యక్షుడు గూడెం సుభాష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చేవేళ్ల పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కృష్ణ స్వామి, ప్రధాన కార్యదర్శి బేతి జగదీష్ రెడ్డి, కుర్రా మహేష్ కుమార్, కోశాధికారి వెలగ రవీ శంకర్, కార్యనిర్వహాక కార్యదర్శులు గుడెపు రాఘవులు, సంధ్యపీగు రాజ శేఖర్, కార్యదర్శి మాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.