భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు.. నీట మునిగిన ఇండ్లు

దిశ, యాదగిరిగుట్ట: గత 24 గంటలుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆలేరు మండలంలో వాగులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలలో వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. మునుపెన్నడూ లేని విధంగా కొలనుపాక, రాఘవపురం, ఆలేరు పెద్దవాగు, రత్నాల వాగు, బైరాకుంటా తదితర వాగులు, కుంటలు నిండి భారీస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఆలేరులోని రంగనాయక వీధి, కుమ్మరి […]

Update: 2021-08-30 04:24 GMT

దిశ, యాదగిరిగుట్ట: గత 24 గంటలుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆలేరు మండలంలో వాగులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలలో వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి.

మునుపెన్నడూ లేని విధంగా కొలనుపాక, రాఘవపురం, ఆలేరు పెద్దవాగు, రత్నాల వాగు, బైరాకుంటా తదితర వాగులు, కుంటలు నిండి భారీస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఆలేరులోని రంగనాయక వీధి, కుమ్మరి వాడ, పెద్దమ్మ వీధి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలేరు మున్సిపల్ ఆఫీస్ లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది.

Tags:    

Similar News