విచిత్ర వాన.. వానను ఫాలో అయిన వాహనదారులు
దిశ, పరకాల: అప్పుడప్పుడు ప్రకృతి వింత పరిణామాలు సృష్టిస్తుంది. వాతావరణంలో అందుకు అనుగుణంగా మార్పులు జరుగుతుంటాయి. అందులో భాగంగానేనేమో ఈరోజు దామెర మండలం ఓగులాపూర్ పవర్ గ్రిడ్ నుండి దామర స్టేజి సమీపంలోని డిస్నీల్యాండ్ స్కూల్ వరకు విచిత్రమైన రీతిలో వాన కురిసింది. పవర్ గ్రిడ్ ముందు ఊరుగొండ నుండి పవర్ గ్రిడ్ వరకు ఎలాంటి వర్షం లేదు. అక్కడ నుండి డిస్నీలాండ్ స్కూల్ తర్వాత ఎలాంటి వర్షం లేదు. ఈ మధ్యలో కురిసిన వాన, వాహనదారులకు […]
దిశ, పరకాల: అప్పుడప్పుడు ప్రకృతి వింత పరిణామాలు సృష్టిస్తుంది. వాతావరణంలో అందుకు అనుగుణంగా మార్పులు జరుగుతుంటాయి. అందులో భాగంగానేనేమో ఈరోజు దామెర మండలం ఓగులాపూర్ పవర్ గ్రిడ్ నుండి దామర స్టేజి సమీపంలోని డిస్నీల్యాండ్ స్కూల్ వరకు విచిత్రమైన రీతిలో వాన కురిసింది. పవర్ గ్రిడ్ ముందు ఊరుగొండ నుండి పవర్ గ్రిడ్ వరకు ఎలాంటి వర్షం లేదు. అక్కడ నుండి డిస్నీలాండ్ స్కూల్ తర్వాత ఎలాంటి వర్షం లేదు. ఈ మధ్యలో కురిసిన వాన, వాహనదారులకు ఆసక్తికరంగా మారింది. ములుగు వైపు నుంచి వచ్చే వాహనాలు ముందు కురుస్తున్న వర్షంతో పవర్ గ్రిడ్ వద్ద వాహనాలు నిలిపి వేశారు. అది క్రమక్రమంగా ముందుకు వెళ్ళి పోతూ ఉండడంతో వాహనదారులు దాన్ని ఫాలో అవుతూ ఎంజాయ్ చేశారు. తీరా డిస్నీలాండ్ స్కూల్ తర్వాత వర్షం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితి పట్ల రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఆసక్తికరంగా చర్చించుకోవడం కొసమెరుపు.