ప్రపంచవ్యాప్తంగా డబ్బుతో ముడిపడిన మూఢ నమ్మకాలు

దిశ, ఫీచర్స్ : సైన్స్ Vs మూఢనమ్మకాలు.. ఈ అంశంపై కొనసాగే అంతులేని చర్చలో మనమందరం జీవితంలో ఒక్కసారైనా భాగమై ఉంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్న క్రమంలో.. డబ్బుతోనూ అనేక మూఢనమ్మకాలు ముడిపడి ఉన్నాయనే విషయం మాత్రం చాలామందికి తెలిసుండదు. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో డబ్బుపై చెలామణిలో ఉన్న కొన్ని విచిత్రమైన మూఢనమ్మకాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. పర్స్ నేలపై పడితే.. డబ్బు వెళ్లిపోయినట్లే.. ఈ మూఢనమ్మకం చైనాలో […]

Update: 2021-11-12 03:45 GMT

దిశ, ఫీచర్స్ : సైన్స్ Vs మూఢనమ్మకాలు.. ఈ అంశంపై కొనసాగే అంతులేని చర్చలో మనమందరం జీవితంలో ఒక్కసారైనా భాగమై ఉంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్న క్రమంలో.. డబ్బుతోనూ అనేక మూఢనమ్మకాలు ముడిపడి ఉన్నాయనే విషయం మాత్రం చాలామందికి తెలిసుండదు. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో డబ్బుపై చెలామణిలో ఉన్న కొన్ని విచిత్రమైన మూఢనమ్మకాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.

పర్స్ నేలపై పడితే.. డబ్బు వెళ్లిపోయినట్లే..

ఈ మూఢనమ్మకం చైనాలో పుట్టింది. సాధారణంగా ప్రజలు డబ్బు, క్రెడిట్ కార్డ్స్ మొదలైన ముఖ్యమైన వస్తువులను తమ వాలెట్/పర్స్‌లో క్యారీ చేస్తారు. అలాంటి పర్సును నేలపై ఉంచడమంటే ఆ వస్తువు పట్ల అగౌరవాన్ని ప్రదర్శిస్తున్నారని అర్థం. ఇది డబ్బు, సంపదను విస్మరిస్తున్నారనే విషయాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇక పాత చైనీస్ సామెత ప్రకారం.. ‘పర్సు నేలమీద ఉందంటే, మీ జీవితం నుంచి డబ్బు వెళ్లిపోయినట్లే’. అందుకే ఈ విశ్వాసాన్ని నమ్మినా, నమ్మకపోయినా వాలెట్/పర్స్‌ను ఎప్పుడూ నేలపై పడేయకుండా జాగ్రత్తవహిస్తే బెటర్!

పడిపోయిన చెట్లపై నాణేన్ని విసిరేస్తే పెరగనున్న డబ్బు..

చెట్లపైన డబ్బు పెరుగుతుందనే విశ్వాసాన్ని ఈ మూఢ నమ్మకం కల్పించింది. నార్త్ వేల్స్‌లోని పోర్ట్‌మీరియన్ గ్రామం ఈ విశ్వాసానికి ప్రసిద్ధి. శతాబ్దాల నాటి సంప్రదాయం ప్రకారం.. అక్కడ కూలిన/పడిపోయిన చెట్లపైకి నాణేలను విసరడం వల్ల అదృష్టంతో పాటు ఆర్థిక లాభం చేకూరుతుందనేది వారి నమ్మకం.

న్యూ ఇయర్‌‌లో ఎంటరయ్యే ముందు నగదు పట్టుకుంటే..

లాటిన్ అమెరికాలో ఉద్భవించిన ఈ మూఢనమ్మకం ప్రకారం.. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ముందు(12 గంటల సమయంలో) చేతిలో కొంత నగదును పట్టుకోవడం ద్వారా కొత్త సంవత్సరంలో ఆర్థిక శ్రేయస్సును పొందవచ్చనేది ఒక నమ్మకం. కాబట్టి రాబోయే కొత్త సంవత్సరంలో మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఫైనాన్షియల్‌గా బెనిఫిట్ పొందవచ్చు.

పక్షి రెట్ట అదృష్టానికి సంకేతం..

ఇది కొంచెం చికాకు తెప్పించవచ్చు కానీ, పక్షి రెట్టను కొందరు నిజంగా అదృష్ట సంకేతంగా భావిస్తారు. టర్కీలో పుట్టిన ఈ మూఢనమ్మకం ప్రకారం.. మనుషుల మీద పక్షి రెట్ట వేస్తే, అది మంచి శకునానికి ప్రతీక. అంతేకాదు అక్కడి ప్రజలు లాటరీ టిక్కెట్టును కూడా అదే రోజున కొనడం ఒక సంప్రదాయం. అందుకే ఎప్పుడైనా పక్షి మీపై రెట్ట వేస్తే అసహ్యంగా భావించకుండా సానుకూల సంకేతంగా తీసుకుంటే మంచిది.

పనిగంటలు ముగిశాక బాస్ మెసేజ్ చేస్తే.. ఇకపై ఇల్లీగల్!

Tags:    

Similar News