వలస కూలీలకు కేంద్రం శుభవార్త
న్యూఢిల్లీ: ఊరుగాని ఊరొచ్చి, చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక నానా వెతలు పడుతున్న వలస కూలీల తిప్పలు ఇక తప్పినట్టే. వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు తమ స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు వలస కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు చర్యలు తీసుకోవడానికి నోడల్ బాడీలను నియమించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. అయితే, […]
న్యూఢిల్లీ: ఊరుగాని ఊరొచ్చి, చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక నానా వెతలు పడుతున్న వలస కూలీల తిప్పలు ఇక తప్పినట్టే. వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు తమ స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు వలస కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు చర్యలు తీసుకోవడానికి నోడల్ బాడీలను నియమించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. అయితే, స్క్రీనింగ్ టెస్టుల్లో కరోనా లక్షణాలు కనిపించనివారికే స్వరాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతినివ్వనున్నారు. కాగా, లాక్‌డౌన్ ముగియడానికి వారం రోజులు కూడా లేని సమయంలో ఈ విధమైన మార్గదర్శకాలివ్వడం గమనార్హం.
Tags: migrant labourers, lockdown, tourists, students, migrants Can Go Home During Lockdown, union home ministry