అధికారుల అండ.. బిల్డర్ల దందా !
దిశ, న్యూస్‌బ్యూరో: 2015 తర్వాత హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు కనిపించవన్న జీహెచ్ఎంసీ మాటలు నీటి మూటలేనా ? సిటీ మెయిన్ రోడ్ల మీద బల్దియా ఆస్తులను ఆక్రమించి అంతస్తులు కడుతున్నా అధికారులకు పట్టవా ? రాజకీయ నేతలు, అధికారుల అండే బిల్డర్లకు వరంగా మారుతుందా ? అంటే అవుననే అంటున్నారు గ్రేటర్ వాసులు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త ఇల్లు, భవనాల నిర్మించుకునే వారు రిజిస్టర్డ్ ఆర్కిటెక్చర్ ద్వారా అప్లికేషన్ సమర్పిస్తేనే అనుమతులు ఇస్తారు. ఎన్ని ఫ్లోర్లకు […]
దిశ, న్యూస్‌బ్యూరో: 2015 తర్వాత హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు కనిపించవన్న జీహెచ్ఎంసీ మాటలు నీటి మూటలేనా ? సిటీ మెయిన్ రోడ్ల మీద బల్దియా ఆస్తులను ఆక్రమించి అంతస్తులు కడుతున్నా అధికారులకు పట్టవా ? రాజకీయ నేతలు, అధికారుల అండే బిల్డర్లకు వరంగా మారుతుందా ? అంటే అవుననే అంటున్నారు గ్రేటర్ వాసులు.
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త ఇల్లు, భవనాల నిర్మించుకునే వారు రిజిస్టర్డ్ ఆర్కిటెక్చర్ ద్వారా అప్లికేషన్ సమర్పిస్తేనే అనుమతులు ఇస్తారు. ఎన్ని ఫ్లోర్లకు ఎంత స్థలం వదలాలి అన్నది కూడా వివరిస్తూ బల్దియా అనుమతి పత్రాలు మంజూరు చేస్తుంది. ఈ క్రమంలోనే కొందరు ఇచ్చిన అనుమతుల కంటే ఎక్కువ అంతస్తులు చేపడుతూ టౌన్‌ప్లానింగ్‌కు నిర్ణయాలకు విరుద్ధంగా బిల్డింగ్‌లు నిర్మిస్తున్నారు. అయితే ఇదంతా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2015అక్టోబర్ నుంచి సిటిలో అక్రమ నిర్మాణాలను పూర్తిగా నిషేధించినట్టు చేబుతున్నా నేటికి లక్షల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా అధికారులు నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారన్న కామెంట్లు వినపడుతున్నాయి. ప్రధానంగా ఐటీ కారిడార్, శేరిలింగంపల్లి, బేగంపేట, సంతోష్‌నగర్, హయత్‌నగర్, కార్వాన్, అల్వాల్, రాజేంద్రనగర్ సర్కిళ్లలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా నోటీసులతో కాలం టైం పాస్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
రెండేళ్లలో టౌన్‌ప్లానింగ్ కూల్చివేసిన నిర్మాణాలు
కేటగిరీ 2019 2018
అనుమతిలేనివి 952 454
శిథిలావస్థలో 229 182
ఆక్రమణలు 466 257
నోటీసులతోనే సరి !
అక్రమ నిర్మాణం గుర్తించిన వెంటనే జీహెచ్‌ఎంసీ యాక్టు 452(1) ద్వారా షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని వారంరోజులు గడువు ఇస్తోంది. సరైన స్పందన లేకుంటే రెండోసారి 452(2) కింద నోటీస్‌తో మూడ్రోజుల టైం ఇస్తారు. అప్పటికీ ఎలాంటి సమాధానం రాకుంటే సెక్షన్ -636 నోటీసుతో 24గంటల టైం ఇస్తారు. దీని ఉద్దేశం నిర్మాణాలు కూల్చివేస్తామని చెప్పడమే. అయితే జీహెచ్‌ఎంసీ కూల్చివేసిన నిర్మాణాలు ఏడాదికి వెయ్యి కూడా దాటకపోవడం విశేషం.
రాజకీయ నాయకుల అండదండలతోనే..
అధికార యంత్రాంగంతో ముందుగా మాట్లాడిన తర్వాతే బిల్డర్లు, రియల్టర్లు నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, నోటీసులు ఎప్పుడు ఎలా వస్తాయో.. వాటికి ఎంత సమయం ఉంటుందో ముందుగానే అధికారులు చెబుతున్నట్టు తెలుస్తోంది. మూడు నోటీసులు ఇచ్చినా కూడా తగినంత టైం ఉంటుంది. ఈ మధ్యలోనే వారు కోర్టుకు వెళ్లేలా సలహాలను కూడా ఇస్తున్నారు. ఫిర్యాదుదారులు ఎవరైనా వివరాలు అడిగితే వ్యవహారం కోర్టులో ఉందని, తాము ఏం చేయలేమని అధికారులు సమాధానమిస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి పూర్తి చేసిన తర్వాత నిర్మాణం కూల్చివేయడం కూడా అంత బాగుండదని వారు వెనక్కి తగ్గుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి.
Tags : Town planning, Ghmc, municipality, KTR, Illegal, property