'ఉన్నది ఒకటే జిందగీ.. అందుకే ఓ ఎఫైర్ పెట్టుకోండి'
దిశ,వెబ్‌డెస్క్: జీవితం చాలా చిన్నది అందుకే ఓ ఎఫైర్ పెట్టుకోండి’ ఇది ఓ డేటింగ్ సైట్ ట్యాగ్ లైన్. అలా అని ఎవరైనా ఎఫైర్ పెట్టుకున్నారా? ఆ ఫైర్ లో ఎవరైనా..! ఎంతటి వారైనా కాలి బూడిదవ్వాల్సిందే. దానికి ఎవరితో సంబంధం ఉండదు. తాను అక్రమంగా ఉంటే చాలనుకుంటుంది. అయితే అది పెళ్లికి ముందైతే కన్నవారిని కాల్చేస్తోంది. పెళ్లి తరువాత అయితే పండంటి కాపురాన్ని కూల్చేస్తోంది. ఒకప్పుడు వివాహేతర సంబంధం అనేది మహా పాపం. కానీ ఇప్పుడది కామన్. […]
దిశ,వెబ్‌డెస్క్: జీవితం చాలా చిన్నది అందుకే ఓ ఎఫైర్ పెట్టుకోండి’ ఇది ఓ డేటింగ్ సైట్ ట్యాగ్ లైన్. అలా అని ఎవరైనా ఎఫైర్ పెట్టుకున్నారా? ఆ ఫైర్ లో ఎవరైనా..! ఎంతటి వారైనా కాలి బూడిదవ్వాల్సిందే. దానికి ఎవరితో సంబంధం ఉండదు. తాను అక్రమంగా ఉంటే చాలనుకుంటుంది. అయితే అది పెళ్లికి ముందైతే కన్నవారిని కాల్చేస్తోంది. పెళ్లి తరువాత అయితే పండంటి కాపురాన్ని కూల్చేస్తోంది. ఒకప్పుడు వివాహేతర సంబంధం అనేది మహా పాపం. కానీ ఇప్పుడది కామన్. ఎందుకింత మార్పొచ్చింది ? వివాహేతర సంబంధాలు మానవ సమాజాన్ని నాశనం చేయడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం?
పెళ్లైన మహిళలు యూకేకి చెందిన ఓ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే అక్రమసంబంధం పెట్టుకోవడం ఈజీ అవుతుంది. అయితే 2009 లో ప్రారంభమైన ఈ యాప్ లో మనదేశానికి చెందిన సుమారు 10 లక్షల మంది మహిళలు ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకునేందుకు లాగిన్ అయ్యారు. తమ యాప్ లో లాగిన్ అయిన మహిళల సంఖ్య 10 లక్షలు దాటడంపై సదరు సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 30 నుంచి 60 సంవత్సరాల వయసున్న 78శాతం ఉన్నత విద్యావంతులు, 74శాతం ఉద్యోగం చేస్తున్న మహిళలు పాల్గొన్నారు.
డేటా ప్రకారం.., సంతానం కలిగిన తరువాత భర్తలు తమ భార్యల్ని మోసం చేయడం సాధారణంగా భావిస్తున్నారు. మహిళలు తమ భర్తల నుంచి ఆశించింది దక్కక పోవడం వల్ల.., తాము భర్త నుంచి ఏదైతే పొందాలని అనుకుంటున్నారో అది పరాయి మగాడితో పొందాలని ఇల్లీగల్ ఎఫైర్ వలలో ఈజీగా చిక్కుకుంటున్నారని తేలింది. దీంతో పాటూ 48 శాతం మంది మహిళలు ధైర్యంగా ఇల్లీగల్ ఎఫైర్ ను కొనసాగిస్తున్నట్లు తేటతెల్లమైంది. సంతానం తరువాత తమ భాగస్వామితో లైంగిక సంతృప్తి పొందలేకపోవడంపై అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న మహిళలు చెబుతున్నారు. అంతేకాదు ఎవరిపైనా ఆధారపడకుండా ఆర్ధికంగా బలంగా ఉన్న మహిళలు తమ జీవితాల్ని అసంతృప్తితో కాకుండా ఉత్సాహంగా, థ్రిల్ గా ఉంచుకునేందుకు ఇష్టపడుతున్నారు.
ఇక్కడ ఆసక్తిర విషయం ఏంటంటే 76 శాతం మంది మహిళలు తమ బాడీ ఫిజిక్ లు బాగున్నాయని, దీంతో భర్తల కంటే తామే ఆకర్షణీయంగా ఉంటామని నమ్ముతున్నారట. 60 శాతం మంది మహిళలు వారి వైవాహిక సంబంధంలో పూర్తిగా సంభోగం లేకపోవడం, 59 శాతం మంది భాగస్వాములు వారి లైంగిక ఆనందాన్ని విస్మరించడం, 64 శాతం మంది లైంగిక అసంతృప్తిలో ఉన్నట్లు డేటింగ్ యాప్ నిర్వహించిన సర్వేలో వెలుగులోకి వచ్చింది.
మోడ్రన్ మహిళలు ఏం కోరుకుంటున్నారో తెలుసా?
భారత్ కు చెందిన మోడ్రన్ మహిళలు (తల్లులు) పడక గదిలో షో పీస్ లా ఉండేందుకు ఇష్టపడడం లేదు. ఆమె సొంత భావోద్వేగ మరియు శారీరక అవసరాలపై శ్రద్ధ చూపించకపోతే భర్తకు, పిల్లలకు కేర్ టేకర్ గా ఉండటాన్ని అసహ్యించుకుంటున్నారు. దీంతో పాటూ శృంగారం, సాన్నిహిత్యాన్ని సమానంగా కోరుకుంటున్నారు. గతంలో కంటే ఇప్పుడు సాధారణ సెక్స్, పెయిడ్ సెక్స్, లేదా సైబర్‌సెక్స్ చాలా తప్పనే భావన క్రమ క్రమంగా తగ్గిపోతుంది. తాము బీసీ కాలంలో లేమని, టెక్ యుగంలో ఉన్నామని కాబట్టి పరాయి మగాడితో ఇల్లీగర్ ఎఫైర్ పెట్టుకోవడం తప్పు కాదని యూకేకి చెందిన ఇల్లీగల్ యాప్ భారత్ లో నిర్వహించిన సర్వేలో ఈ మోడ్రన్ మహిళలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.