రాకేశ్ టికాయత్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి

జైపూర్: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్ కాన్వాయ్ దాడికి గురైంది. గుర్తు తెలియని దుండగులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, సీసాలు విసిరారు. శుక్రవారం రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా తతర్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హర్సోరాలో కిసాన్ మహా పంచాయత్ నిర్వహించి.. అక్కడ్నుంచి బన్సోర్ వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌పై దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో టికాయత్ ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి. ఇదే విషయమై టికాయత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. […]

Update: 2021-04-02 09:35 GMT

జైపూర్: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్ కాన్వాయ్ దాడికి గురైంది. గుర్తు తెలియని దుండగులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, సీసాలు విసిరారు. శుక్రవారం రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా తతర్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హర్సోరాలో కిసాన్ మహా పంచాయత్ నిర్వహించి.. అక్కడ్నుంచి బన్సోర్ వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌పై దుండగులు రాళ్లు రువ్వారు.

ఈ ఘటనలో టికాయత్ ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి. ఇదే విషయమై టికాయత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది బీజేపీ పనేనని ఆరోపించారు. ‘అల్వార్ జిల్లాలో నా కాన్వాయ్‌పై దాడి జరిగింది. బీజేపీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారు’ అని ట్వీట్ చేశారు. టికాయత్ కాన్వాయ్‌పై దాడికి నిరసనగా ఢిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల్లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు ఘజీపూర్ బోర్డర్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News