ఇంకా కరోనా ముప్పు..!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి రికార్డు స్థాయిలో రికవరీలు పుంజుకుంటున్నప్పటికీ పెద్దమొత్తంలో ప్రజలు ఇంకా వైరస్ సోకే ముప్పును ఎదుర్కొంటున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) వెల్లడించింది. డిసెంబర్ 17 నుంచి జనవరి 8 వరకు ఐసీఎంఆర్ నిర్వహించిన దేశవ్యాప్త సీరో సర్వే అంశాలను కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. దేశంలోని 21.5శాతం మంది మాత్రమే కరోనా వైరస్‌ ముప్పును ఎదుర్కొన్నారని సర్వేలో వెల్లడైందని తెలిపింది. ఇంకా చాలా మంది వైరస్ నుంచి దూరంగానే ఉన్నారని, […]

Update: 2021-02-04 11:29 GMT

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి రికార్డు స్థాయిలో రికవరీలు పుంజుకుంటున్నప్పటికీ పెద్దమొత్తంలో ప్రజలు ఇంకా వైరస్ సోకే ముప్పును ఎదుర్కొంటున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) వెల్లడించింది. డిసెంబర్ 17 నుంచి జనవరి 8 వరకు ఐసీఎంఆర్ నిర్వహించిన దేశవ్యాప్త సీరో సర్వే అంశాలను కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. దేశంలోని 21.5శాతం మంది మాత్రమే కరోనా వైరస్‌ ముప్పును ఎదుర్కొన్నారని సర్వేలో వెల్లడైందని తెలిపింది.

ఇంకా చాలా మంది వైరస్ నుంచి దూరంగానే ఉన్నారని, కాబట్టి టీకా పంపిణీ ప్రక్రియ తప్పనిసరిగా అవసరమని వివరించింది. పల్లెల్లో కంటే పట్టణాల్లోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నదని పేర్కొంది. అలాగే, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతున్నదని తెలిపింది. ప్రస్తుతం 5.42శాతంగా ఉన్నదని వివరించింది. 47 జిల్లాల్లో కొత్త కేసులు రిపోర్ట్ కాలేదని, 251 జిల్లాల్లో గత మూడువారాల్లో ఒక్క కరోనా మరణం సంభవించలేదని పేర్కొంది.

Tags:    

Similar News