బీజేపీ యాత్రకు అనుమతివ్వం
చెన్నై: తమిళనాడులో ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు బీజేపీ తలపెట్టిన వెట్రి వెల్ యాత్రను కరోనా కారణంగా అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టులో తెలిపింది. ఈ యాత్రతో కరోనా కేసులు పెరిగే ప్రమాదమున్నదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో బీజేపీ రాష్ట్ర యూనిట్ అధికారిక సంప్రదింపులు జరిగే అవకాశముంది. లార్డ్ మురుగను కొలుస్తూ రాష్ట్రంలోని ఆరు ఆధ్యాత్మిక ప్రాంతాలను కలుపుతూ నెలపాటు ఈ యాత్ర నిర్వహించడానికి బీజేపీ […]
చెన్నై: తమిళనాడులో ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు బీజేపీ తలపెట్టిన వెట్రి వెల్ యాత్రను కరోనా కారణంగా అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టులో తెలిపింది. ఈ యాత్రతో కరోనా కేసులు పెరిగే ప్రమాదమున్నదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో బీజేపీ రాష్ట్ర యూనిట్ అధికారిక సంప్రదింపులు జరిగే అవకాశముంది. లార్డ్ మురుగను కొలుస్తూ రాష్ట్రంలోని ఆరు ఆధ్యాత్మిక ప్రాంతాలను కలుపుతూ నెలపాటు ఈ యాత్ర నిర్వహించడానికి బీజేపీ యోచించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ యాత్ర తలపెట్టడం గమనార్హం. ఈ యాత్రను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. అనుమతిని నిరాకరిస్తామన్న ప్రభుత్వం చెప్పడంతో కోర్టు పిటిషన్లను తోసిపుచ్చింది. అయితే, సర్కారు నిర్ణయాన్నిసవాల్ చేయడానికి బీజేపీకి అనుమతించింది.