గృహ రుణాలు తీసుకునే వారికి SBI బంపర్ ఆఫర్.. కొద్దిరోజులు మాత్రమే..!

దిశ, వెబ్‌డెస్క్ : సొంతింటి కల కొందరికీ కలగానే మిగిలిపోతుంది. అందుకు వివిధ కారణాలు ఉండొచ్చు. జీవితకాలంలో చేసే సేవింగ్స్ సరిపోకపోవచ్చు. తమకు నచ్చిన రెడీమేడ్ ఇంటికి మార్కెట్లో ధర ఎక్కువగా ఉండటం, కొత్తగా నిర్మించుకుందామంటే నిర్మాణ ఖర్చులు అధికం అవ్వడం, ఆర్థిక స్థిరత్వం లేకపోవడం, మెడికల్, పిల్లల చదువుల కోసం ఇలా కొందరు తమ సొంతింటి కలను నిజం చేసుకోలేక పదే పదే వాయిదా వేస్తూ వస్తుంటారు. అలాంటి వారికోసం దేశంలోని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ […]

Update: 2021-07-31 23:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సొంతింటి కల కొందరికీ కలగానే మిగిలిపోతుంది. అందుకు వివిధ కారణాలు ఉండొచ్చు. జీవితకాలంలో చేసే సేవింగ్స్ సరిపోకపోవచ్చు. తమకు నచ్చిన రెడీమేడ్ ఇంటికి మార్కెట్లో ధర ఎక్కువగా ఉండటం, కొత్తగా నిర్మించుకుందామంటే నిర్మాణ ఖర్చులు అధికం అవ్వడం, ఆర్థిక స్థిరత్వం లేకపోవడం, మెడికల్, పిల్లల చదువుల కోసం ఇలా కొందరు తమ సొంతింటి కలను నిజం చేసుకోలేక పదే పదే వాయిదా వేస్తూ వస్తుంటారు. అలాంటి వారికోసం దేశంలోని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు గృహరుణాలు అందిస్తూ ఎంతో మందికి సొంతింటి కలను సాకారం చేశాయి.

ఇటీవల కరోనా ఎఫెక్ట్ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఉన్న సేవింగ్స్ కాస్త మెడికల్ బిల్స్ కే సరిపోగా.. కొందరు రివర్స్‌లో అప్పులు కూడా చేసేస్థాయికి పడిపోయారు. ఒక్క ఇండియాలోనే కాకుండా ఈ మహమ్మారి తీసుకొచ్చిన మాంద్యం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే దేశంలో పరిస్థితులు చక్కబడుతుండగా.. తమ కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు బ్యాంకులు కూడా వివిధ విభాగాల్లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి.

ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గృహ రుణాలు తీసుకోవాలనుకునేవారికి శుభవార్త చెప్పింది. హోం లోన్ పై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు నెలాఖరు వరకు తీసుకునే రుణాలపై మాత్రమే ఈ ఆఫర్ ప్రకటిస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం గృహరుణాలపై 0.40 శాతం ప్రాసెసింగ్ ఫీజును SBI వసూలు చేస్తుండగా.. ‘మాన్ సూన్ ధమాకా ఆఫర్’ పేరుతో దీనిని రద్దు చేసింది. అంతేకాకుండా SBI ప్రస్తుతం 6.70 శాతం వడ్డీకే గృహరుణాలు అందిస్తుండగా.. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేస్తున్న వారికి 0.05 శాతం అదనంగా వడ్డీ రాయితీని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే వారికి SBI ప్రకటించిన ఈ ఆఫర్ ద్వారా భారీ స్థాయిలో లబ్ది చేకూరనుంది. ఇంకెందుకు మరి ఆలస్యం త్వరపడండి..

Tags:    

Similar News