చార్‌ధామ్ యాత్ర ప్రారంభం
డెహ్రాడూన్: చార్‌ధామ్ యాత్ర శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం వెల్లడించారు. కాగా యాత్ర కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చార్‌ధామ్ యాత్రను సందర్శించాలనుకునే భక్తులు దేవస్థాన మేనెజ్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్ https://badrinath-kedarnath.gov.inలో రిజిష్టర్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. యాత్రకు సంబంధించిన సూచనలు, మార్గదర్శకాలను వెబ్‌సైట్‌లోని సబ్ లింక్‌లో అప్‌లోడ్ చేయనున్నట్టు వెల్లడించారు. భక్తులు తప్పనిసరిగా కొవిడ్-19 నెగెటివ్ రిపోర్టు సమర్పించాలని లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అందజేయాలని […]
డెహ్రాడూన్: చార్‌ధామ్ యాత్ర శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం వెల్లడించారు. కాగా యాత్ర కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చార్‌ధామ్ యాత్రను సందర్శించాలనుకునే భక్తులు దేవస్థాన మేనెజ్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్ https://badrinath-kedarnath.gov.inలో రిజిష్టర్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. యాత్రకు సంబంధించిన సూచనలు, మార్గదర్శకాలను వెబ్‌సైట్‌లోని సబ్ లింక్‌లో అప్‌లోడ్ చేయనున్నట్టు వెల్లడించారు. భక్తులు తప్పనిసరిగా కొవిడ్-19 నెగెటివ్ రిపోర్టు సమర్పించాలని లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అందజేయాలని పేర్కొన్నారు.
కాగా యాత్రపై గతంలో విధించిన నిషేధాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఎత్తివేసింది. భక్తులు కొవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే కేదార్‌నాథ్ ధామ్‌కు రోజుకు 800 మంది, బదరీనాథ్ ధామ్‌కు 1,200 మంది, గంగోత్రికి 600 మంది, యమునోత్రి ధామ్‌కు 400 మంది చొప్పున భక్తులను మాత్రమే అనుమతించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.