వారం రోజుల ముందుకు ఐపీఎల్ షెడ్యూల్?
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాదికి టీ20 వరల్డ్ కప్ రద్దు చేయడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు మార్గం సుగమమైంది. సెప్టెంబర్ 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్నట్లు ఆయా ఫ్రాంచైజీలకు బీసీసీఐ సమాచారం పంపింది. వారం రోజుల్లో ఐపీఎల్ గవర్నింగ్ బాడీ సమావేశమై పూర్తిస్థాయి షెడ్యూల్ నిర్ణయించనుంది. అయితే, ఐపీఎల్‌ను వారం రోజులు ముందుకైనా, వెనుకకైనా పొడిగించాలని స్టార్ ఇండియా అంటున్నది. వారం రోజులు పొడిగించడం ద్వారా బీసీసీఐ, స్టార్ గ్రూప్‌లకు లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నది. ఈ […]
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాదికి టీ20 వరల్డ్ కప్ రద్దు చేయడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు మార్గం సుగమమైంది. సెప్టెంబర్ 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్నట్లు ఆయా ఫ్రాంచైజీలకు బీసీసీఐ సమాచారం పంపింది. వారం రోజుల్లో ఐపీఎల్ గవర్నింగ్ బాడీ సమావేశమై పూర్తిస్థాయి షెడ్యూల్ నిర్ణయించనుంది. అయితే, ఐపీఎల్‌ను వారం రోజులు ముందుకైనా, వెనుకకైనా పొడిగించాలని స్టార్ ఇండియా అంటున్నది. వారం రోజులు పొడిగించడం ద్వారా బీసీసీఐ, స్టార్ గ్రూప్‌లకు లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 26 నవంబర్ 8 వరకు జరగాల్సిన ఐపీఎల్‌ను వారం రోజుల ముందుగా అంటే సెప్టెంబర్ 19నే ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తున్నది. రాత్రి మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు బదులుగా 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. దీపావళి (నవంబర్ 14) వరకు టోర్నీని పొడిగిస్తే వీక్షణలు పెరగడంతోపాటు ప్రకటనల ధర కూడా అధికంగా ఉంటుందని స్టార్ ఇండియా భావిస్తున్నది.