అవకాశాల కోసం దారుణానికి ఒడిగట్టిన స్టార్ యాంకర్.. ఏకంగా ఆ బాబాతో కలిసి

దిశ, వెబ్‌డెస్క్: సినిమా..  ఓ గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. కానీ, ఆ అవకాశాన్ని వినియోగించుకొని స్టార్ డమ్ ని కొనసాగించడం మాత్రమే కష్టంగా ఉంటుంది. అన్ని ఒడిదుడుకులు దాటుకొని స్టార్ గా కొనసాగినా అది ఎన్నేళ్లు ఉంటుందో చెప్పడం  ఎవరివల్ల కాదు. ఇక హీరోయిన్ల విషయంలో ఇది ఇంకా కష్టంగా ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన ఏ హీరోయిన్ అయినా ఎక్కువ రోజులు స్టార్ గా ఉండాలనే కోరుకొంటుంది. ఇక వీరిలానే బుల్లితెరలో […]

Update: 2021-10-12 05:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినిమా.. ఓ గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. కానీ, ఆ అవకాశాన్ని వినియోగించుకొని స్టార్ డమ్ ని కొనసాగించడం మాత్రమే కష్టంగా ఉంటుంది. అన్ని ఒడిదుడుకులు దాటుకొని స్టార్ గా కొనసాగినా అది ఎన్నేళ్లు ఉంటుందో చెప్పడం ఎవరివల్ల కాదు. ఇక హీరోయిన్ల విషయంలో ఇది ఇంకా కష్టంగా ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన ఏ హీరోయిన్ అయినా ఎక్కువ రోజులు స్టార్ గా ఉండాలనే కోరుకొంటుంది. ఇక వీరిలానే బుల్లితెరలో కొనసాగే యాంకర్లు సైతం తమ ఉనికిని కాపాడుకోవడానికి కష్టపడుతుంటారు. ఇక తాజాగా ఓ స్టార్ యాంకర్ తన స్టార్ డమ్ ని ఎక్కువకాలం నిలుపుకోవడానికి దారుణానికి ఒడిగట్టింది. ఎక్కువకాలం ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగడానికి, అవకాశాలు ఎక్కువ రావడానికి క్షుద్ర పూజలు సైతం చేసిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

స్టార్ యాంకర్ గా బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న ఓ యాంకరమ్మ ప్రస్తుతం సినిమాలో కూడా బాగానే అవకాశాలను అందుకొంటుంది. అయితే తన స్టార్ డమ్ ఇలాగే కొనసాగాలని కోరుకున్న ఈ భామ ఒక స్వామీజి ని కలిసిందంట. తానెప్పుడూ బుల్లితెరపై స్టార్ గా కొనసాగాలంటే ఏం పూజలు చేయాలనీ అడగగా.. ఆయన క్షుద్ర పూజలు చేయమని చెప్పడంతో వాటికి కూడా వెనకాడలేదట. బాబా చెప్పిన మాటలు నమ్మి యాంకర్ క్షుద్ర పూజలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో, లేదో తెలియదు కానీ ఆ హాట్ భామ మాత్రం ఇప్పటికీ స్టార్ యాంకర్ గా కొనసాగడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదంతా క్షుద్ర పూజలు ఫలితమే అని కొందరు అంటుండగా.. మరికొందరు ఆమె లక్ అలా ఉందని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఈ స్టార్ యాంకర్ లక్ మాత్రం చాలా గట్టిగానే ఉన్నట్టుంది. ఎంతమంది కొత్తవారు వస్తున్నా ఈమె గుర్తింపు మాత్రం తగ్గడంలేదంటే అతిశయోక్తి కాదు. మరి ముందు ముందు అమ్మడి జాతకం ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags:    

Similar News