డేంజర్.. పెట్రోల్ బంకులో ఆ పని చేయొద్దని తెలియదా..!
దిశ, కుత్బుల్లాపూర్: పెట్రోల్ బంకుల్లో ఫోన్ మాట్లాడితే అగ్ని ప్రమాదాలు జరగడం ప్రసార మాధ్యమాల్లో ఎన్నో చూశాము. పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చే వారు ఫోన్‌లను ఆఫ్ చేయాలని, ముందు జేబులో పెట్టుకోవద్దని అధికారుల సూచనలతో సూక్తులు పెడతారు. అయితే, కుత్బుల్లాపూర్ సర్కిల్ సుచిత్ర నుండి జీన్స్ కంపెనీ వెళ్లే రోడ్డులో రిటైర్డ్ తహసీల్దార్ ఓ పెట్రోల్ బంక్‌ను కూతురితో కలిసి నిర్వహిస్తున్నాడు. అయితే ఈ బంకులో కనీస నిబంధనలు పాటించడం లేదు. అందులో పని చేసే యువకులు […]
దిశ, కుత్బుల్లాపూర్: పెట్రోల్ బంకుల్లో ఫోన్ మాట్లాడితే అగ్ని ప్రమాదాలు జరగడం ప్రసార మాధ్యమాల్లో ఎన్నో చూశాము. పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చే వారు ఫోన్‌లను ఆఫ్ చేయాలని, ముందు జేబులో పెట్టుకోవద్దని అధికారుల సూచనలతో సూక్తులు పెడతారు. అయితే, కుత్బుల్లాపూర్ సర్కిల్ సుచిత్ర నుండి జీన్స్ కంపెనీ వెళ్లే రోడ్డులో రిటైర్డ్ తహసీల్దార్ ఓ పెట్రోల్ బంక్‌ను కూతురితో కలిసి నిర్వహిస్తున్నాడు. అయితే ఈ బంకులో కనీస నిబంధనలు పాటించడం లేదు. అందులో పని చేసే యువకులు సెల్ ఫోన్‌లు మాట్లాడుతూ పెట్రోల్ పోయడం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇకపోతే ప్రజల అవసరార్థం ఏర్పాటు చేసిన మరుగు దొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. ఈ విషయమై యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా తమనే బెదిరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కనీస జాగ్రత్తలు పాటించడంతో పాటు మరుగు దొడ్లును శుభ్రం చేయించాలని కోరుతున్నారు.