గాంధీభవన్ గడపతొక్కిన స్టాఫ్ నర్సులు.. అరెస్టు!

దిశ, వెబ్‌‌డెస్క్ : కరోనా కష్టకాలంలో విశేష సేవలందించిన ఔట్‌సోర్సింగ్ స్టాఫ్ నర్సులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశాఖలో కొత్తగా స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేయడంతో కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న వారిని తెలంగాణ ఆరోగ్యశాఖ విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే, తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అర్ధాంతరంగా విధుల్లోంచి తొలగించడంపై స్టాఫ్ నర్సులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం గాంధీభవన్ గడప తొక్కిన బాధితులు కాంగ్రెస్ ప్రచార […]

Update: 2021-07-09 05:23 GMT

దిశ, వెబ్‌‌డెస్క్ : కరోనా కష్టకాలంలో విశేష సేవలందించిన ఔట్‌సోర్సింగ్ స్టాఫ్ నర్సులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశాఖలో కొత్తగా స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేయడంతో కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న వారిని తెలంగాణ ఆరోగ్యశాఖ విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే, తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అర్ధాంతరంగా విధుల్లోంచి తొలగించడంపై స్టాఫ్ నర్సులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఈ క్రమంలోనే శుక్రవారం గాంధీభవన్ గడప తొక్కిన బాధితులు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ను కలిశారు. తమ సమస్యలు విన్నవించిన అనంతరం గాంధీ భవన్ నుంచి డీఎంఈ కార్యాలయం ముట్టడికి స్టాఫ్ నర్సులు యత్నించారు. దీంతో వారిని ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News