థమన్.. ‘వి’ బీజీఎమ్ కాపీ కొట్టాడా?
దిశ, వెబ్‌డెస్క్ : నాని – సుధీర్ బాబు కాంబినేషన్‌లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వి’. ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో శనివారం (సెప్టెంబర్ 5) విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటించారు. ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన లభించిన ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించాడు. కానీ, డేట్స్ అడ్జెట్స్ కాకపోవడంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇవ్వలేకపోయాడు. దీంతో […]
దిశ, వెబ్‌డెస్క్ :
నాని – సుధీర్ బాబు కాంబినేషన్‌లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వి’. ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో శనివారం (సెప్టెంబర్ 5) విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటించారు. ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన లభించిన ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించాడు. కానీ, డేట్స్ అడ్జెట్స్ కాకపోవడంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇవ్వలేకపోయాడు. దీంతో ‘అల వైకుంఠపురములో’ మూవీకి సూపర్ డూపర్ హిట్ పాటలిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ థమన్‌ను ‘వి’ బీజీఎమ్ కోసం తీసుకున్నారు. అయితే ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాపీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం. అంతేకాదు థమన్ కాపీ క్యాట్ అంటూ మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు.
‘అల వైకుంఠపురములో’ మూవీకి తను కంపోజ్ చేసిన పాటలు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో థమన్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలోనే ‘వి’ చిత్ర బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం థమన్‌ను తీసుకున్నారు. అయితే, ఇప్పటికే ఎన్నో హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన థమన్‌కు ట్రోలింగ్ బాధ తప్పడం లేదు. థమన్ ఇచ్చిన మ్యూజిక్‌ను.. ఇతర చిత్రాల్లోని ఒరిజనల్ మ్యూజిక్‌తో కంపేర్ చేస్తూ.. మీమ్స్ చేస్తున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘వి’ చిత్రానికి కూడా కాపీ మ్యూజిక్ అందించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘వి’ బీజీఎమ్ ‘రాక్షసన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్’ 6వ సీజన్ 10వ ఎపిసోడ్‌లోని వైల్డ్ ఫైర్ బీజేఎంను వాడుకున్నారని విమర్శిస్తున్నారు. ‘వి’ క్లైమాక్స్‌కు ముందుగావచ్చే సీక్వెన్స్‌లోనూ తమిళ్ ‘అసురన్’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వాడారని కామెంట్స్ పెడుతున్నారు.
‘వకీల్ సాబ్, క్రాక్, సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాలకు థమన్ ఇప్పటికే మ్యూజిక్ అందించాడు. వీటితో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’, నాని టక్ జగదీష్ చిత్రాలకు కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు.