మహేష్ తోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ .. క్లారిటీ ఇచ్చిన జక్కన్న

ఎస్.ఎస్. రాజమౌళి .. తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడు. బాహుబలి సినిమా ద్వారా ఇండియన్ సినిమా తలెత్తుకునేలా చేసిన దర్శకుడు. ప్రభాస్ ను నేషనల్ లెవల్ హీరోను చేసిన జక్కన్న… బాహుబలి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి. దీంతో మా ప్రిన్స్ .. పాన్ ఇండియా స్టార్ అయిపోతాడని మురిసిపోయారు ఫ్యాన్స్. తీరా చూస్తే తారక్, చరణ్ హీరోలుగా RRR మూవీ అనౌన్స్ చేశాడు రాజమౌళి. […]

Update: 2020-04-18 03:29 GMT

ఎస్.ఎస్. రాజమౌళి .. తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడు. బాహుబలి సినిమా ద్వారా ఇండియన్ సినిమా తలెత్తుకునేలా చేసిన దర్శకుడు. ప్రభాస్ ను నేషనల్ లెవల్ హీరోను చేసిన జక్కన్న… బాహుబలి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి. దీంతో మా ప్రిన్స్ .. పాన్ ఇండియా స్టార్ అయిపోతాడని మురిసిపోయారు ఫ్యాన్స్. తీరా చూస్తే తారక్, చరణ్ హీరోలుగా RRR మూవీ అనౌన్స్ చేశాడు రాజమౌళి. దీంతో మహేష్ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.

అయితే తాజా ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సింపుల్ గా సమాధానం ఇచ్చేసి… తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతోనే అని క్లారిటీ ఇచ్చాడు. దానయ్యతో RRR మూవీ పూర్తి కాగానే.. K.L. నారాయణ నిర్మాతగా మహేష్ తో సినిమా ప్రారంభిస్తానని తెలిపాడు. ఈ సినిమాకు సంబంధించిన కథ గురించి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చర్చిస్తున్నట్లు చెప్పారు. దీంతో ప్రిన్స్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

Tags: SSRajamouli, RRR, Mahesh Babu, Bahubali

Tags:    

Similar News