రాజాసింగ్‌కు శ్రీశైలం ఈవో కౌంటర్

దిశ, వెబ్‌డెస్క్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆలయ ఈవో కేఎస్ రామారావు కౌంటర్ ఇచ్చారు. ఆలయ పరిధిలో అన్యమతస్తులకు గతంలోనే షాపులు కేటాయించారని, వారి దుకాణాలను తొలగించేందుకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. అన్యమతస్తుల షాపుల తొలగింపు విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, న్యాయస్థానం తీర్పు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా, శ్రీశైలంలో అన్యమతస్తులు ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని, గంటామఠం పునర్నిర్మాణం పనుల్లో బంగారం, వెండి నాణేలు లభ్యమయ్యాయని వజ్రాలు, వైడూర్యాలేమీ […]

Update: 2020-12-26 22:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆలయ ఈవో కేఎస్ రామారావు కౌంటర్ ఇచ్చారు. ఆలయ పరిధిలో అన్యమతస్తులకు గతంలోనే షాపులు కేటాయించారని, వారి దుకాణాలను తొలగించేందుకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. అన్యమతస్తుల షాపుల తొలగింపు విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, న్యాయస్థానం తీర్పు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా, శ్రీశైలంలో అన్యమతస్తులు ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని, గంటామఠం పునర్నిర్మాణం పనుల్లో బంగారం, వెండి నాణేలు లభ్యమయ్యాయని వజ్రాలు, వైడూర్యాలేమీ దొరకలేదని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, మల్లన్న సన్నిధిలో అన్యమతస్తుల ప్రమేయం పెరిగిపోతుందని, వారికే ఉద్యోగాలు కల్పిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే.

 

Tags:    

Similar News