సమంతకు శ్రీరెడ్డి నీతులు.. అలా ఉండు అంటూ ఘాటు వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ లవ్ కపుల్ నాగచైతన్య- సమంత విడిపోతున్నారని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై నాగ్ ఫ్యామిలీ ఎక్కడా స్పందించకపోవడం తో వీరి ఫ్యాన్స్ ఇదంతా నిజమేమో అనుకుని విడిపోవద్దంటూ సోషల్ మీడియా లో వేడుకుంటున్నారు. ఒక పక్క సామ్ లైవ్ లో స్పందిస్తూ ఈ పుకార్లన్నీ అబద్దాలని ప్రకటించినా  అభిమానులకు క్లారిటీ రావడంలేదు.  ఇక  తాజాగా  సామ్ చైతూ ల విడాకుల పై సినీ నటి శ్రీ […]

Update: 2021-09-30 00:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ లవ్ కపుల్ నాగచైతన్య- సమంత విడిపోతున్నారని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై నాగ్ ఫ్యామిలీ ఎక్కడా స్పందించకపోవడం తో వీరి ఫ్యాన్స్ ఇదంతా నిజమేమో అనుకుని విడిపోవద్దంటూ సోషల్ మీడియా లో వేడుకుంటున్నారు. ఒక పక్క సామ్ లైవ్ లో స్పందిస్తూ ఈ పుకార్లన్నీ అబద్దాలని ప్రకటించినా అభిమానులకు క్లారిటీ రావడంలేదు. ఇక తాజాగా సామ్ చైతూ ల విడాకుల పై సినీ నటి శ్రీ రెడ్డి వీడియో ద్వారా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

వీడియో లో ఏముందంటే.. “మీరు ఎప్పుడూ కలిసి ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. సంసారంలో సరిగమలుండటం సహజమే.. సంసారంలో గొడవలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఈగోలు సహజమే.. అన్నింటినీ సర్దుకుని పోవాలి. అమ్మాయికి ఓపిక ఎక్కువగా ఉంటుంది అంటారు. సమంత కూడా అలా ఓపికతో ఉండాలి. సమంత కూడా కొన్ని మార్చుకుంటే తన సంసారం బాగుంటుంది. ఎంత సమంత అని పేరు పెట్టుకున్నా.. హాలీవుడ్ ఫిగర్ లాగా, స్టైల్ గా, మోడల్ లా ఉంటామంటే కుదరదు.. ఎందుకంటే అది మన కల్చర్ కాదు. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే.. సమంత వదినా చక్కగా సంసారం చేసుకో.. మీకు సినిమాలు, మోడలింగ్ ఇష్టమైనప్పటికీ కొంత అడ్జస్ట్ అవుతే మంచిది. ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలుసు.. త్వరగా వాటిని సాల్వ్ చేసుకోండి.’ అని చెప్పుకొచ్చింది. ఇక వీటిపై నెటిజన్లు పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు శ్రీరెడ్డి కి సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు పద్ధతులు గురించి, పెళ్లి గురించి ఎవరు ఎవరికి చెప్తున్నారో చూడండి అంటూ విమర్శిస్తున్నారు.

https://twitter.com/MsSriReddy/status/1442827646270730240

Tags:    

Similar News