ఫిర్యాదులు వస్తే.. కఠిన చర్యలు తప్పవు.. మంత్రి హెచ్చరిక
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనాతో ఆసుపత్రులలో చేరుతున్న వారి నుండి పెద్ద మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు ,క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఆసుపత్రిలో చేరిన వారి నుండి పెద్ద మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారని ట్విట్టర్ ద్వారా పలువురు రోగులు చేసిన ఫిర్యాదు మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూత్పూర్ మండల కేంద్రంలోని పంచవటి హాస్పిటల్ ను […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కరోనాతో ఆసుపత్రులలో చేరుతున్న వారి నుండి పెద్ద మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు ,క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఆసుపత్రిలో చేరిన వారి నుండి పెద్ద మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారని ట్విట్టర్ ద్వారా పలువురు రోగులు చేసిన ఫిర్యాదు మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూత్పూర్ మండల కేంద్రంలోని పంచవటి హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి కరోనా నిబంధనలు పాటిస్తూ నేరుగా పంచవటి హాస్పిటల్లోని కరోనా వార్డులోకి వెళ్లారు. అక్కడ పరిస్థితులను పరిశీలించి కరోనాతో చికిత్స పొందుతున్న వారికి సహాయంగా వచ్చిన వారితో మాట్లాడారు.
ఆస్పత్రిలో ఎప్పుడు చేరారు, ఏం మందులు ఇస్తున్నారు, బిల్లులు ఏ మేరకు వసూలు చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఆక్సిజన్, వెంటిలేషన్ సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా అని ప్రశ్నించారు..? అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలోని నవోదయ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ ఉన్న వసతులు, సౌకర్యాలు, వైద్య సేవలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఆస్పత్రిలోనైనా చార్జీలు ఎక్కువగా వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య సిబ్బంది పేషెంట్లకు సరైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న వారిని అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఆహార సౌకర్యాలను కూడా కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో బెడ్ లు లేకుంటేనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చుకోవాలని మంత్రి సూచించారు.