డప్పు కొట్టి.. దరువేసిన మంత్రి శ్రీనివాస్
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం డప్పు కొట్టి.. దరువేసి అందరిని ఆకట్టుకున్నారు. ఉదయం నుండి మహబూబ్ నగర్ పట్టణంలో నిర్వహించిన పలు కార్యక్రమాలు, సభలు, సమావేశాలలో పాల్గొన్న తర్వాత టీటీడీ గుట్ట ప్రాంతంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం భవనం ప్రారంభోత్సవం కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి మంత్రి రాగానే యాదవులు ఉత్సాహంగా డబ్బులు కొడుతూ స్వాగతం పలికారు. […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం డప్పు కొట్టి.. దరువేసి అందరిని ఆకట్టుకున్నారు. ఉదయం నుండి మహబూబ్ నగర్ పట్టణంలో నిర్వహించిన పలు కార్యక్రమాలు, సభలు, సమావేశాలలో పాల్గొన్న తర్వాత టీటీడీ గుట్ట ప్రాంతంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం భవనం ప్రారంభోత్సవం కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి మంత్రి రాగానే యాదవులు ఉత్సాహంగా డబ్బులు కొడుతూ స్వాగతం పలికారు. యాదవ సంఘ సభ్యులు పలికిన స్వాగతంతో మంత్రి ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు.
ఈ క్రమంలో తానే డప్పు తీసుకుని ఉత్సాహంగా డప్పు కొడుతూ దరువు వేశారు. మంత్రి ఉత్సాహంగా డప్పు కొడుతూ తమతో కలిసి దరువు వేయడంతో యాదవ సంఘం సభ్యులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అనంతరం నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదవులు మరింత ఉత్సాహంతో మంత్రికి గొంగడి కప్పి.. గొర్రె పిల్లను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యాదవుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం సభ్యులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.