మహిళలకు అండగా ఆ సంస్థలు.. తక్కువ వడ్డీకి రుణాలనిస్తూ
దిశ, వెబ్‌డెస్క్ : మహిళా ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ఐకేపీ , స్త్రీనిధి సంస్థలు మరో సరికొత్త అధ్యాయానికి నాంది పలికాయి. కష్టపడేతత్వం, సాధించాలనే తపన, ఆర్థికంగా ఎదగాలనే పట్టుదల ఉన్న ప్రతీ మహిళా సంఘా సభ్యురాలికి నేనున్నాను అంటూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించి, ఆర్థికంగా ఎదగాలనే ప్రతీ మహిళా సంఘ సభ్యురాలికి న్యూ ఎంటర్ ప్రైసెస్ ఆక్టివిటీ ద్వారా 3 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ రుణాలతో […]
దిశ, వెబ్‌డెస్క్ : మహిళా ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ఐకేపీ , స్త్రీనిధి సంస్థలు మరో సరికొత్త అధ్యాయానికి నాంది పలికాయి. కష్టపడేతత్వం, సాధించాలనే తపన, ఆర్థికంగా ఎదగాలనే పట్టుదల ఉన్న ప్రతీ మహిళా సంఘా సభ్యురాలికి నేనున్నాను అంటూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించి, ఆర్థికంగా ఎదగాలనే ప్రతీ మహిళా సంఘ సభ్యురాలికి న్యూ ఎంటర్ ప్రైసెస్ ఆక్టివిటీ ద్వారా 3 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ రుణాలతో మహిళలు కొత్త వ్యాపార సముదాయాలు ప్రారంభించి కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.
కోటగిరి మండల కేంద్రంలో పురుషులతో సమానంగా కిరాణ, బట్టల షాపులు, హోటల్, కుట్టు మిషన్, డైరీ వంటి వ్యాపారాల్లో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓ వైపు వ్యాపారం మరో వైపు పశు పోషణ ద్వారా దినదినాభివృద్ధి చెందుతూ అందరిచేత ఔరా అనిపించుకుంటున్నారు. మహిళా తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటూ రుజువు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఈ ఏడాది దాదాపు 1 కోటికి పైగా బ్యాంక్ లింకేజ్, స్త్రీనిధి రుణాలతో దాదాపు 120 కొత్త వ్యాపార సముదాయాలు ప్రారంభించారు. అంతే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మహిళా అవార్డును సైతం కైవసం చేసుకొని సమాజంలో తమకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకుని శభాష్ అనిపించుకుంటున్నారు.