టీమ్ ఇండియాతో తలపడే శ్రీలంక జట్టు ఇదే
దిశ, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా కొలంబో వేదికగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నెల 18న భారత జట్టు తొలి వన్డే ఆడనున్నది. కాగా, శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమ్ ఇండియాతో తలపడబోయే శ్రీలంక జట్టును ఆ దేశ బోర్డు ప్రకటించింది. గాయం కారణంగా కెప్టెన్ కుషాల్ పెరీరా, బినురా ఫెర్నాండో సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో డాసన్ షనకను శ్రీలంక జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించారు. […]
దిశ, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా కొలంబో వేదికగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నెల 18న భారత జట్టు తొలి వన్డే ఆడనున్నది. కాగా, శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమ్ ఇండియాతో తలపడబోయే శ్రీలంక జట్టును ఆ దేశ బోర్డు ప్రకటించింది. గాయం కారణంగా కెప్టెన్ కుషాల్ పెరీరా, బినురా ఫెర్నాండో సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో డాసన్ షనకను శ్రీలంక జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించారు. 2019లో తొలిసారి శ్రీలంక కెప్టెన్‌గా వ్యవహరించిన షనక.. పాకిస్థాన్‌పై టీ20 సిరీస్ విజయాన్నందించాడు. వెస్టిండీస్ పర్యటనకు కూడా ఎంపికైనప్పటికీ వీసా సమస్య కారణంగా పాల్గొనలేకపోయాడు. భారత్‌తో సిరీస్‌ల్లో ధనుంజయ డిసిల్వా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
శ్రీలంక జట్టు:
డసన్ షనక(కెప్టెన్), ధనుంజయ డిసిల్వా(వైస్ కెప్టెన్), అవిష్కా ఫెర్నాండో, భనుక రాజపక్స, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, వానిందు హరసరంగ, యాషెన్ బండార, మినొద్ భానుక, లాహిరు ఉడారా, రామేశ్ మెండీస్, చామిక కరుణరత్నే, దుష్మంత చమీరా, లక్షణ్ సందకన్, అకిలా ధనుంజయ, షిరన్ ఫెర్నాండో, ధనుంజయ లక్షణ్, ఇషాన్ జయరత్నే, ప్రవీణ్ జయవిక్రెమా, అసితా ఫెర్నాండో, కసున్ రజితా, లాహిరు కుమార, ఇసురు ఉడాన.