బాడ్మింటన్‌లో శ్రీకాంత్ సంచలనం.. భారత్‌కు పతకం ఖాయం..!
దిశ, వెబ్‌డెస్క్: భారత బాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఏ బారత బ్యాడ్మెంటన్ క్రీడాకారుడు సాధించని ఫీట్‌ను శ్రీకాంత్ అందకున్నాడు. ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరిన మొద్దమొదటి భారతీయ క్రీడాకారుడిగా శ్రీకాంత్ ఈ ఘనత సాధించాడు. ప్రీఫైనల్‌లో ఆరోస్థానంలో ఉన్న లక్ష్య సేన్‌ను 17-21, 21-14, 21-17 తో మట్టి కరిపించి శ్రీకాంత్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. మొదటి గేమ్ సెట్‌లో శ్రీకాంత్ ఓటమిని చవిచూసినప్పటికీ, తరువాత రెండు గేమ్ సెట్స్‌లో […]
దిశ, వెబ్‌డెస్క్: భారత బాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఏ బారత బ్యాడ్మెంటన్ క్రీడాకారుడు సాధించని ఫీట్‌ను శ్రీకాంత్ అందకున్నాడు. ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరిన మొద్దమొదటి భారతీయ క్రీడాకారుడిగా శ్రీకాంత్ ఈ ఘనత సాధించాడు. ప్రీఫైనల్‌లో ఆరోస్థానంలో ఉన్న లక్ష్య సేన్‌ను 17-21, 21-14, 21-17 తో మట్టి కరిపించి శ్రీకాంత్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. మొదటి గేమ్ సెట్‌లో శ్రీకాంత్ ఓటమిని చవిచూసినప్పటికీ, తరువాత రెండు గేమ్ సెట్స్‌లో మాత్రం జూలు విదిలించాడు.
పూర్తి స్థాయి స్కోరింగ్‌తో శ్రీకాంత్ విజయకేతం ఎగురవేశాడు. ఈ విజయంతో ప్రపంచ బాడ్మింటన్ ఫైనల్‌కు చేరుకున్న మొట్టమొదటి భారత మేల్ బ్యాడ్మింటన్ క్రీడాకరుడిగా శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. దీంతో భారత్‌కు పతకం ఖాయమని అభిమానులు అంటున్నారు. అయితే సెమీ ఫైనల్‌కు చేరినందుకు లక్ష్య సేన్ కాంస్య పతకం అందుకోనున్నాడు.