గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగ‌ళ‌‌‌వారం రాత్రి తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామి గ‌రుడ వాహ‌నంపై ద‌ర్శనమిచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి జితేంద్రకుమార్ మ‌హేశ్వరి వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని […]

Update: 2020-10-20 11:39 GMT

దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగ‌ళ‌‌‌వారం రాత్రి తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామి గ‌రుడ వాహ‌నంపై ద‌ర్శనమిచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి జితేంద్రకుమార్ మ‌హేశ్వరి వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.

గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజేస్తున్నారు. ఉదయం మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు.

కార్యక్రమంలో పెద్ద జీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, ఈవో జవహర్రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు ప్రశాంతి రెడ్డి, మురళీకృష్ణ, నిశ్చిత, భాస్కరరావు, ప్రతాపరెడ్డి, శివకుమార్, శివశంకరన్, గోవిందహరి, అనంత, కుమారగురు, రమేష్శెట్టి, ప్రసాద్, దామోదరరావు, పార్థసారథి రెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్జెట్టి, అర్బన్ఎస్పీ రమేష్రెడ్డి, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, పేష్కార్జగన్మోహనాచార్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News