పాత స్పాన్సరే కానీ తక్కువ ధరకు

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ బోర్డుల ఆదాయం కరోనా ముందో లెక్క, కరోనా తర్వాత మరో లెక్కలా తయారైంది. పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు స్పాన్సరే కరువయ్యారు. వాళ్ల మ్యాచ్‌ల హక్కులు తీసుకోవడానికి కూడా ఏ బ్రాడ్‌కాస్టర్ ముందుకు రాలేదు. శ్రీలంక పరిస్థితి కూడా అలాగే ఉంది. టీం స్పాన్సర్ లేక బ్రాడ్‌కాస్టర్ లేక ఆదాయం గణనీయంగా కోల్పోతున్నది. ప్రస్తుతం శ్రీలంక టీం స్పాన్సర్‌గా ఉన్న ‘డయలాగ్’ గడువు ముగిసింది. కొత్త స్పాన్సర్లు దొరకకపోవడంతో శ్రీలంక క్రికెట్ పాత భాగస్వామితోనే […]

Update: 2020-07-16 10:24 GMT

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ బోర్డుల ఆదాయం కరోనా ముందో లెక్క, కరోనా తర్వాత మరో లెక్కలా తయారైంది. పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు స్పాన్సరే కరువయ్యారు. వాళ్ల మ్యాచ్‌ల హక్కులు తీసుకోవడానికి కూడా ఏ బ్రాడ్‌కాస్టర్ ముందుకు రాలేదు. శ్రీలంక పరిస్థితి కూడా అలాగే ఉంది. టీం స్పాన్సర్ లేక బ్రాడ్‌కాస్టర్ లేక ఆదాయం గణనీయంగా కోల్పోతున్నది. ప్రస్తుతం శ్రీలంక టీం స్పాన్సర్‌గా ఉన్న ‘డయలాగ్’ గడువు ముగిసింది. కొత్త స్పాన్సర్లు దొరకకపోవడంతో శ్రీలంక క్రికెట్ పాత భాగస్వామితోనే జట్టు కట్టింది. గతంలో చెల్లించిన దాని కంటే 30శాతం తక్కువకే తాజా ఒప్పందం కుదిరింది. గతంలో మూడేళ్లకు 6.5 మిలియన్ డాలర్లు చెల్లించిన డయలాగ్, కొత్త ఒప్పందం ప్రకారం రాబోయే మూడేళ్లకు 4.8 మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లించడానికి ఒప్పుకుంది. అసలే కరోనా కాలంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా డయలాగ్ చెప్పిన ధరకే స్పాన్సర్‌షిప్ హక్కులు ఇచ్చేసింది. శ్రీలంకలో డయలాగ్ అతిపెద్ద టెలికాం కంపెనీ. అక్కడ దానికి 44శాతం మార్కెట్ ఉంది.

Tags:    

Similar News