గ‌రుడ‌ వాహనంపై శ్రీ కోదండ‌‌రాముడు

దిశ, వెబ్‌డెస్క్: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఐదో ‌రోజు రాత్రి గ‌రుడ‌ వాహనంపై స్వామివారు సీతా, ల‌క్ష్మ‌ణ స‌మేతంగా క‌టాక్షించారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు. గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాలా సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది. ఈ […]

Update: 2021-04-25 10:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఐదో ‌రోజు రాత్రి గ‌రుడ‌ వాహనంపై స్వామివారు సీతా, ల‌క్ష్మ‌ణ స‌మేతంగా క‌టాక్షించారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు. గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాలా సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది.

108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది. ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ ధ‌నంజ‌యులు, శ్రీ గిరిబాబు, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News