ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో స్నేహమే కొంపముంచిందా?

దిశ ప్రతినిధి,నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీలో జరుగుతున్న పరిణామాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అక్కడ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఉన్న పొద్దుటూరి వినయ్ రెడ్డిపై జిల్లా పార్టీ  వైఖరి ఇప్పుడు కమలం పార్టీలో ఉత్కంఠత రేపుతున్నాయి. వినయ్ రెడ్డిని పార్టీ నుంచి పోమ్మనలేక పోగపెడుతున్నారా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహచరుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వినయ్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఆర్మూర్ నుంచి […]

Update: 2021-02-20 20:22 GMT
దిశ ప్రతినిధి,నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీలో జరుగుతున్న పరిణామాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అక్కడ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఉన్న పొద్దుటూరి వినయ్ రెడ్డిపై జిల్లా పార్టీ వైఖరి ఇప్పుడు కమలం పార్టీలో ఉత్కంఠత రేపుతున్నాయి. వినయ్ రెడ్డిని పార్టీ నుంచి పోమ్మనలేక పోగపెడుతున్నారా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహచరుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వినయ్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఆర్మూర్ నుంచి పోటీ చేసి జీవన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీ అర్వింద్‌కు 30వేల మెజార్టీ రావడంలోనూ వినయ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కానీ ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో వినయ్ రెడ్డిని సాగనంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. బీజేపీ తరపున ఇక్కడ మరోక వ్యక్తిని తయారు చేస్తున్నట్లు తెలుస్తున్నది. మరోక వ్యక్తిని తెర మీదకు తీసుకురావడం వెనక ఎదో జరుగుతుందనే భావన కనిపిస్తున్నది.

ఎమ్మెల్యేతో స్నేహం..

బీజేపీ రాష్ర్ట కౌన్సిల్ సభ్యులు వినయ్‌రెడ్డికి, ప్రస్తుత అధికార పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఉన్న వ్యాపార సంబందాలు ఉన్నాయి. ఇదే ఆయనకు పార్టీలో ప్రతిబంధకంగా మారాయనే వాదనలు ఉన్నాయి. పార్టీల పరంగా జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డిలు వేర్వేరు అయినప్పటికీ వ్యాపార పరంగా కలిసే ఉంటారు. దీంతో వినయ్ రెడ్డి వ్యవహర శైలిపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. బిజినెస్ వ్యవహరాలు అర్థిక సమస్యలను కలిగిస్తాయని, జీవన్ రెడ్డితో, తెగదెంపులు చేసుకోకపోవడంతో వినయ్ రెడ్డిని పార్టీ నమ్మలేని పరిస్థితికి వచ్చిందని సమాచారం. అలాగే గతేడాది అధికార పార్టీ చెపట్టిన ఆకర్ష్ కార్యక్రమంలో భాగంగా కొందరు కమలనాథులతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఆర్మూర్ నియోజకవర్గంలో 2023 ఎన్నికల నాటికి అధికార పార్టీ టికెట్ కేటాయింపులో మార్పులు జరుగుతాయని, టికెట్ కోసం జంప్ జిలానీలు ట్రాక్ సిద్ధం చేసుకుంటున్నారని ఆర్మూర్‌లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం లోపాయికారీ ఒప్పందాల గురించి పెద్ధ ఎత్తునా పోస్టులు వైరల్ అయ్యాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఓ పంక్షన్‌లో టికెట్ వచ్చిన రాకున్నా నేనే ఎమ్మెల్యే అని వినయ్ రెడ్డి చేసిన వాఖ్యలు వారి సన్నిహితుల ద్వారా బహిర్గతమయ్యాయి. ఈ వాఖ్యలు నర్మగర్భంగా చేసినవా లేక పక్క ప్లాన్ ప్రణాళికతో ఉన్నారా అనే అనుమానాలు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

తెరమీదకు స్రవంతి రెడ్డి..

ఆర్మూర్ పార్టీ నియోజకవర్గ భాధ్యతలు చూస్తున్న వినయ్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డిని పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. గత ఎనిమిది నెలలుగా స్రవంతి రెడ్డిని నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిని దాటి ఆర్మూర్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. దీని వెనుక టార్గెట్ వినయ్ రెడ్డి అనే టాక్ వినిపిస్తున్నది. స్రవంతి రెడ్డిని బలోపేతం చేయడం కోసం ఇటీవల ఆమెకు రాష్ర్ట మహిళ అధికార ప్రతినిధి పదవి ఇచ్చారనే వాదనలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటిపై వినయ్‌రెడ్డి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వద్ధ చెప్పుకుని వాపోయినట్లు తెలిసింది. కానీ అక్కడ కుడా వినయ్ రెడ్డికి ఎలాంటి అస్యూరేన్స్ రాలేదని సమాచారం. ఈ పరిణామాలను చూస్తుంటే పార్టీ వినయ్‌రెడ్డికి పోగపెడుతున్నట్లు కనిపిస్తున్నది.
Tags:    

Similar News