నీళ్ల కోసం ఉడుత విన్నపం!
దిశ, వెబ్డెస్క్: ఎండాకాలంలో.. మానవాళితో పాటు జంతువులు, పక్షులు కూడా ‘దాహం’తో అల్లాడిపోతుంటాయి. నల్లాలు, బోర్ల దగ్గర ఎన్నో పక్షులు, జంతువులు నీళ్ల కోసం పాట్లుపడటాన్ని మనం కూడా ఎన్నోసార్లు గమనించే ఉంటాం. అంతేకాదు పక్షుల దాహాన్ని తీర్చేందుకు బాల్కనీల్లో, డాబా పైన నీళ్లతో నింపిన తొట్టీలను, గిన్నెలను ఉంచుతాం. అయితే.. సమ్మర్ అయిపోయింది కదా. వానలు కూడా దంచి కొడుతున్నాయి. ఈ సమయంలో దాహం గురించి ఎందుకు చర్చ అంటే.. ఓ ఉడుత దాహం కోసం […]
దిశ, వెబ్డెస్క్: ఎండాకాలంలో.. మానవాళితో పాటు జంతువులు, పక్షులు కూడా ‘దాహం’తో అల్లాడిపోతుంటాయి. నల్లాలు, బోర్ల దగ్గర ఎన్నో పక్షులు, జంతువులు నీళ్ల కోసం పాట్లుపడటాన్ని మనం కూడా ఎన్నోసార్లు గమనించే ఉంటాం. అంతేకాదు పక్షుల దాహాన్ని తీర్చేందుకు బాల్కనీల్లో, డాబా పైన నీళ్లతో నింపిన తొట్టీలను, గిన్నెలను ఉంచుతాం. అయితే.. సమ్మర్ అయిపోయింది కదా. వానలు కూడా దంచి కొడుతున్నాయి. ఈ సమయంలో దాహం గురించి ఎందుకు చర్చ అంటే.. ఓ ఉడుత దాహం కోసం మనుషుల వెంట పడింది. ఓ జంటను నీళ్లు కావాలని ప్రాధేయపడింది. దాహం తీర్చుకునే వరకు విన్నపాలు చేస్తూ తిరిగింది. మొదట ఆ ఉడుత ఎందుకు వెంటపడుతుందో ఆ జంటకు అర్థం కాలేదు. కానీ ఉడుత ప్లీజ్ ప్లీజ్.. అన్నట్లు తిరుగుతుంటే తేరుకున్న ఆ జంట.. చేతిలో ఉన్న నీళ్ల బాటిల్తో ఉడుత దాహం తీర్చారు. నీళ్లు తాగేసిన ఆ ఉడుత అక్కడి నుంచి తుర్రుమంది. కానీ ఆ వీడియో మాత్రం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అవుతోంది.