60ఏళ్లు పైబడిన వారికి ‘స్పుత్నిక్ వి’ ఓకే : రష్యా
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు అత్యవసర వినియోగం కింద స్పుత్నిక్ వి టీకాను వినియోగించేందుకు రష్యా అనుమతించింది. దీంతో ఆ దేశంలో 60ఏళ్లు పైబడిన వారికి టీకా ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నందున రష్యాలో ఇప్పటికే దాదాపు రెండు లక్షల టీకాలను పంపిణీ చేశారు. తాజాగా స్పుత్నిక్ వి టీకాను ఇటీవల 60 ఏళ్లు పైబడిన వృద్ధులపై కూడా రష్యా విడిగా […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు అత్యవసర వినియోగం కింద స్పుత్నిక్ వి టీకాను వినియోగించేందుకు రష్యా అనుమతించింది. దీంతో ఆ దేశంలో 60ఏళ్లు పైబడిన వారికి టీకా ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.
ఇప్పటికీ కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నందున రష్యాలో ఇప్పటికే దాదాపు రెండు లక్షల టీకాలను పంపిణీ చేశారు. తాజాగా స్పుత్నిక్ వి టీకాను ఇటీవల 60 ఏళ్లు పైబడిన వృద్ధులపై కూడా రష్యా విడిగా ప్రయత్నించింది. మెరుగైన ఫలితాలు రావడంతో అందరూ ఈ టీకాను వినియోగించవచ్చునని ప్రకటించింది.