రియా అభ్యర్ధనపై సుప్రీంలో తీర్పు రిజర్వ్
దిశ, వెబ్ డెస్క్: రియా అభ్యర్ధనపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తును ముంబైకి బదిలీ చేయాలని రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. సుశాంత్ ఫ్యామిలీ లాయర్, రియా తరపు న్యాయవాది, మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది మరియు సిబిఐకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సొలిసిటర్ జనరల్ వాదనలు విన్న తరువాత… సుప్రీం అన్ని పార్టీలను లిఖితపూర్వక పిటిషన్లు దాఖలు చేయాలని కోరింది. గురువారం లోగా ఈ పిటిషన్లు దాఖలు చేయాలని గడువు విధించింది.
దిశ, వెబ్ డెస్క్: రియా అభ్యర్ధనపై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తును ముంబైకి బదిలీ చేయాలని రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.
సుశాంత్ ఫ్యామిలీ లాయర్, రియా తరపు న్యాయవాది, మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది మరియు సిబిఐకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సొలిసిటర్ జనరల్ వాదనలు విన్న తరువాత… సుప్రీం అన్ని పార్టీలను లిఖితపూర్వక పిటిషన్లు దాఖలు చేయాలని కోరింది. గురువారం లోగా ఈ పిటిషన్లు దాఖలు చేయాలని గడువు విధించింది.