WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం ఈజీ కాదు : రాహుల్ ద్రావిడ్

Update: 2023-06-06 11:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: లండన్‌లోని ఓవల్ వేదికగా రేపు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ సిరీస్ ఫైనల్స్ ప్రారంభం కాబోతోంది. చివరిసారి కూడా ఈ టోర్నీ ఫైనల్ చేరిన భారత జట్టు.. తుదిపోరులో న్యూజిల్యాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తమ జట్టు గురించి పలు విషయాలు మాట్లాడాడు. 'చివరిసారి న్యూజిలాండ్‌తో ఫైనల్లో ఓడాం. అంత మాత్రాన మా ఆటతీరు అలాగే ఉంటుందని అనుకోవద్దు. ఐసీసీ ట్రోఫీ ప్రయత్నంలో మేం ఒత్తిడికి గురవ్వం. గెలిస్తే నిజంగా సంతోషమే. ఐసీసీ ట్రోఫీ గెలవడం బాగుంటుంది. అంతకన్నా ముందు మీరు మా రెండేళ్ల ఆటతీరును మెచ్చుకోవాలి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇక్కడికి చేరుకున్నాం' అని రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. ఫైనల్‌ చేరుకొనేందుకు అందరూ కలసికట్టుగా శ్రమించారు. పాయింట్ల పట్టికను గమనిస్తే ఎన్నో పాజిటివ్‌ అంశాలు తెలుస్తాయి. ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచాం. ఇంగ్లాండ్‌లో డ్రా చేసుకున్నాం. మిగిలిన సిరీసుల్లో నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డామని రాహుల్ తెలిపాడు.

ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతున్న పుజారా సలహాలు తీసుకుంటున్నామని ద్రవిడ్‌ తెలిపాడు. ససెక్స్‌ను అతడు విజయవంతంగా నడిపిస్తున్నాడని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌ కండీషన్స్‌, కన్వర్షన్స్‌, బౌలింగ్‌ తీరుపై అతడితో చర్చించామన్నాడు. ఇక చాలా కాలం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే గురించి కూడా ద్రావిడ్ ప్రస్తావించాడు. 'రహానే అద్భుతమైన స్లిప్ ఫీల్డర్. రహానేకి విదేశీ గడ్డపై మంచి రికార్డులు ఉంది. ఇంగ్లాండ్‌లోనూ తిరుగులేని విధంగా ఆడాడు.. భారత జట్టును మంచి సక్సెస్ దిశగా నడిపిన అనుభవం కూడా అతనికి ఉందన్నాడు.

Tags:    

Similar News