ప్రపంచ కప్ సూపర్ లీగ్ పాయింట్స్ టేబుల్..

క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్ వన్డే పాయింట్స్ టేబుల్‌ను ఐసీసీ ప్రకటించింది. బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించడంలో క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో తిరిగి అగ్ర స్థానానికి చేరుకుంది.

Update: 2023-03-05 05:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్ వన్డే పాయింట్స్ టేబుల్‌ను ఐసీసీ ప్రకటించింది. బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించడంలో క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో తిరిగి అగ్ర స్థానానికి చేరుకుంది. ఈ టేబుల్‌లో ఇంగ్లాండ్.. 155 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో ఉండగా.. 150 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో, 139 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో ఉన్నాయి.

అలాగే 130 పాయింట్లతో పాకిస్తాన్ నాలుగో స్థానంలో, 120 పాయింట్లతో ఆస్ట్రేలియా 5వ స్థానంలో, 120 పాయింట్లతో బంగ్లాదేశ్ 6వ స్థానంలో, 115 పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్ 7వ స్థానంలో ఉన్నాయి. కాగా ఈ టేబుల్ టాప్ 7లో ఉన్న జట్లు,  ఆతిధ్య జట్టు అయిన భారత్‌కు ఆటోమేటిక్‌గా 2023 వరల్డ్ కప్ ఆడటానికి అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు 8వ స్థానంలో అలాగే, దక్షిణాఫ్రికా 9వ స్థానంలో, శ్రీలంక 10 స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ జట్లు వరల్డ్ కప్ ఆడాలంటే.. మిగిలిన చిన్న జట్లతో క్వాలిఫైయర్ మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News