Women's Asia Cup final చివర్లో తడబడిన భారత బ్యాటర్లు.. శ్రీలంక టార్గెట్ ఇదే

ఉమెన్స్ ఆసియా కప్ టీ20 ఫైనల్ మ్యాచ్ భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతుంది. దంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

Update: 2024-07-28 11:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ఆసియా కప్ టీ20 ఫైనల్ మ్యాచ్ భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతుంది. దంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదటి వికెట్ కు 44 పరుగుల భాగస్వామ్యం తో పవర్ ప్లే లో మంచి శుభారంభాన్ని అందించింది. అలాగే మిడిల్ ఓవర్లలో కూడా నిలకడగా రాణించినప్పటికి కీలక ప్లేయర్లు వెంట వెంటనే అవుట్ అయ్యారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇందులో భారత్ బ్యాటర్లు షెఫాలి వర్మ 16, మందన 60, జెమిమా రోడ్రిగ్స్ 29, రిచా గోష్ 30 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో దంబుల్లా 2, చమరి అథాపత్తు, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసాలు ఒక్కో వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచులో శ్రీలంక గెలవాలంటే నిర్ణీత 120 బంతుల్లో 166 పరుగులు చేయాల్సి ఉంది. మరీ ఈ మీడియమ్ స్కోరును శ్రీలంక బ్యాటర్లు చేజ్ చేసి విజయం సాధిస్తారా లేక.. భారత బౌలర్ల దాటికి కుప్ప కూలుతారో తెలియాలంటే మ్యాచ్ చివరి వరకు చూడాల్సిందే మరి.

Tags:    

Similar News