మ్యారేజ్ ప్లాన్స్‌పై ఓపెన్ అయిన కుల్దీప్.. ఆమెను మాత్రం చేసుకోనని స్పిన్నర్ క్లారిటీ

టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా కుల్దీపే వెల్లడించాడు.

Update: 2024-07-07 13:58 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా కుల్దీపే వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుల్దీప్ మ్యారేజ్ ప్లాన్స్ గురించి ఓపెన్ అయ్యాడు. ‘నా మ్యారేజ్ గురించి త్వరలోనే మీకు గుడ్ న్యూస్ అందుతుంది.’ అని చెప్పాడు. అలాగే, తనకు ఎలాంటి అమ్మాయి కావాలో కూడా వివరించాడు. తనను, తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునే అమ్మాయి అయి ఉండాలన్నాడు. నటిని మాత్రం అస్సలు వివాహం చేసుకోనని చెప్పాడు. కాగా, టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు. మొదట గ్రూపు మ్యాచ్‌ల్లో కుల్దీప్‌కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయితే, సూపర్-8 మ్యాచ్‌ల్లో తుది జట్టులోకి వచ్చిన అతను సత్తాచాటాడు. ఐదు మ్యాచ్‌ల్లో 6.95 ఎకనామీతో 10 వికెట్లు పడగొట్టాడు. 


Similar News