Women's T20 World Cup : బోణీ కొట్టిన ఇంగ్లాండ్.. తక్కువ స్కోరును కాపాడుకుని.. బంగ్లాను చిత్తు చేసి

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది.

Update: 2024-10-05 19:00 GMT

దిశ, స్పోర్ట్స్ : మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది. షార్జా వేదికగా శనివారం రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తక్కువ స్కోరేకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. వ్యాట్ హోడ్జ్(41) టాప్ స్కోరర్. నాట్ స్కివర్ బ్రంట్(2), హీథర్ నైట్(6), అలిస్ క్యాప్సే(9) వంటి స్టార్లు విఫలమవడంతో కష్టంగానే ఆ స్కోరు చేయగలిగింది. బంగ్లా బౌలర్లు నహిదా అక్టెర్, ఫాహిమా, రితూ మోని రెండేసి వికెట్లతో సమిష్టిగా రాణించి బలమైన ఇంగ్లాండ్‌ను కట్టడి చేశారు. అనంతరం ఇంగ్లాండ్ బౌలర్లు మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఛేదనలో బంగ్లాను 91/7 స్కోరుకే నిలువరించారు. శోభన మోస్తరి(44) రాణించగా.. ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లిన్సే స్మిత్, షార్లెట్ డీన్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. నాట్ స్కివర్ బ్రంట్, సారాహ్ గ్లెన్ చెరో వికెట్ తీశారు. 

Tags:    

Similar News