Kohli సెంచరీలు చేసిన ఫలితం లేదు.. భారత్‌కు టైటిల్స్ కావాలి: పాక్ మాజీ ప్లేయర్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ రషీద్ లతీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. తన ప్రదర్శనపై అభిమానులు, మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తుండగా.. పాక్ మాజీ ప్లేయర్ రషీద్ లతీఫ్ స్పందించాడు. ' సెంచరీల సంఖ్యను లెక్కించడానికి ఇది సమయం కాదు. దానికి ఇప్పుడు పట్టింపు లేదు. టీమిండియా టైటిల్ గెలవాలి. ట్రోఫీలను అందుకుని చాలా ఏళ్లు గడిచాయి. కోహ్లీ 100 సెంచరీలు చేసినా లేదా 200 చేసినా పర్వాలేదు. కానీ, భారత్‌కు మాత్రం టైటిల్స్ ముఖ్యమని అన్నాడు. అంతేకాకుండా భారత అభిమానులు ఎదురుచూస్తోంది కోహ్లీ రికార్డుల కోసం కాదని, తన జట్టు ట్రోఫీల కోసమని దుయ్యబట్టాడు. టీమిండియా ఆసియా కప్‌లో విఫలమయ్యారని.. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 ప్రపంచ కప్, చివరి రెండు టీ20 ప్రపంచ కప్‌లు కూడా పోయాయని వ్యాఖ్యనించాడు.
Also Read...
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హతకు భారత్ ఏం చేయాలి