Yashaswi Jaiswal : 40కి పైగా సెంచరీలు బాదేస్తాడు.. జైస్వాల్‌పై మ్యాక్స్‌వెల్ ప్రశంసలు
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 40కి పైగా సెంచరీలు బాదేస్తాడని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అన్నాడు.
దిశ, స్పోర్ట్స్ : భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 40కి పైగా సెంచరీలు బాదేస్తాడని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అన్నాడు. ఓ పోడ్ క్యాస్ట్‌తో మ్యాక్స్ వెల్ బుధవారం మాట్లాడాడు. ‘జైస్వాల్లో ఎలాంటి బలహీనతలు లేవు. షార్ట్ బంతులను సమర్ధంగా ఎదుర్కొంటాడు. స్పిన్‌ను అద్భుతంగా ఆడతాడు. విదేశీ పిచ్‌లను కూడా తేలిగ్గా అర్థం చేసుకుంటాడు. మైదానం నలువైపులా షాట్లు కొట్టడం జైస్వాల్ స్పెషాలిటీ. కఠినమైన బంతులను వదిలేస్తాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోపీలో అతన్ని ఆస్ట్రేలియా నిలువరించకపోతే ఇబ్బందులు తప్పవు.’ అన్నాడు.
బుమ్రా బెస్ట్ ఫాస్ట్ బౌలర్
బుమ్రా ప్రపంచంలోనే ‘ఆల్ టైమ్ బెస్ట్ ఫాస్ట్ బౌలర్’ అని మ్యాక్స్‌వెల్ అన్నాడు. అన్ని ఫార్మాట్లలో అతను తీసిన వికెట్లు పక్కనపెడితే బ్యాట్స్మెన్లకు అతడి బౌలింగ్ ను ఎదుర్కొవడం చాలా కష్టం అని తెలిపాడు. యూనిక్ బౌలింగ్ యాక్షన్‌తో అతను కంప్లీట్ ప్యాకేజీ అని మ్యాక్స్ వెల్ అన్నాడు. పేస్‌తో పాటు నెమ్మదిగా బంతులు వేసి ఫలితం రాబట్టగలడు. బుమ్రా బౌలింగ్‌లో బంతులు ఎక్కువగా ఎడ్జ్‌లు తీసుకుంటాయని తెలిపాడు. అయితే ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో బుమ్రా 8 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.