రేపు స్వదేశానికి వినేశ్.. గోల్డ్ మెడలిస్ట్‌లాగా స్వాగతం పలుకుతాం : వినేశ్ పెదనాన్న

పారిస్ ఒలింపిక్స్‌లో అదనపు బరువు కారణంగా పతకం కోల్పోయిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

Update: 2024-08-15 20:05 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో అదనపు బరువు కారణంగా పతకం కోల్పోయిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. జాయింట్ సిల్వర్ మెడల్ ఇవ్వాలన్న ఆమె పిటిషన్‌ను కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌(కాస్) కొట్టివేయడంతో ఆమె ఒలింపిక్ పతక ఆశలు ఆవిరయ్యాయి. అయితే, రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునేలా వినేశ్‌ను ఒప్పిస్తానని ఆమె చిన్ననాటి కోచ్, పెదనాన్న మహావీర్ పొగట్ తెలిపారు.

కాస్ తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశించాం. కానీ, కాస్ ఇచ్చిన తీర్పు తర్వాత ఇంకా దేనికి అవకాశం లేదు. 17న వినేశ్ స్వదేశానికి రానుంది. బంగారు పతకం గెలిస్తే ఎలా స్వాగతం చెబుతామో అంత ఘనంగా ఆమెకు స్వాగతం పలుకుతాం. అలాగే, 2028 ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేలా ఆమెను ఒప్పిస్తాం. సంగీత ఫొగట్, రీతు ఫొగట్‌లను కూడా వచ్చే ఒలింపిక్స్‌కు సిద్ధం చేస్తాం.’ అని చెప్పారు.

Tags:    

Similar News