కోహ్లీపై ప్రశంసలు కురిపించిన అజిత్ అగార్కర్
భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ప్రశంసలు కురిపించారు. ఫిట్ నెస్ విషయంలో బెంచ్ మార్క్ సెట్ చేసిన వారిలో ఒకడు కోహ్లీ అని అన్నారు.
దిశ, స్పోర్ట్స్: భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ప్రశంసలు కురిపించారు. ఫిట్ నెస్ విషయంలో బెంచ్ మార్క్ సెట్ చేసిన వారిలో ఒకడు కోహ్లీ అని అన్నారు. దాదాపు 15 ఏళ్ల నుంచి ఫిట్ గా ఉన్నాడని కొనియాడారు. యువతరానికి అతనో ఉదాహరణగా నిలిచాడని అన్నారు. గత 10 నుంచి 15 ఏళ్లలో యువతరంలో ఏదైనా మార్పు చూశానంటే.. అది ఫిట్ నెస్ లెవల్స్ అని అన్నారు. స్పాటిఫై విత్ పీఆర్జీ అనే పాడ్ కాస్ట్ లో కోహ్లీ ఫిట్ నెస్ గురించి, మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ గురించి విషయాలు పంచుకున్నారు అజిత్ అగార్కర్.
మరోవైపు సీఎస్కే ప్లేయర్ ఎంఎస్ ధోనిని సహజసిద్ధమైన ఆటగాడిగా అభివర్ణించారు అజిత్ అగార్కర్. ధోని కెప్టెన్సీ గురించి కొనియాడాడు. ఫీల్డ్ లో కెప్టెన్ గా ధోనీ తీసుకునే నిర్ణయాలను ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా భర్తీ చేయలేదని అన్నారు. అందుకే ఎంఎస్ ను గొప్ప కెప్టెన్ అంటారని అన్నారు. అతడికి ఆట ఎలా మారుతుందో అన్నది తెలుసు అని అన్నారు. మైదానంలో కెప్టెన్ అవసరం ఉందని.. ఎందుకంటే ప్లేయర్ ప్లాన్ చేసే ప్రతీది అతడు అనుకున్నట్లు సాగదని.. మార్గనిర్దేశం చేసేందుకు కెప్టెన్ అవసరమని అన్నారు.