డబుల్ సెంచరీ చేజార్చుకున్న కోహ్లీ..

ఆసీస్ జరుగుతున్న చివరి టెస్టులో టీమ్ ఇండియా 571 పరుగులకు ఆలౌటైంది.

Update: 2023-03-12 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్ జరుగుతున్న చివరి టెస్టులో టీమ్ ఇండియా అద్భుతమైన పోరాటం నమోదు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులు చేయగా.. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 571 పరుగులు చేసింది. తద్వారా 91 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించింది. శ్రేయస్ వెన్ను నొప్పితో బ్యాటింగ్‌కు రాలేదు. కోహ్లీ (186) పరుగులతో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. అయితే దాదాపు మూడేళ్ల వెయిటింగ్ కు ఎండ్ కార్డ్ వేస్తూ.. సుధీర్ఘ ఫార్మాట్ లో మూడంకెల స్కోరుని అందుకున్నాడు. దీంతో కోహ్లీ ఖాతాలో 75వ సెంచరీ చేరింది. కోహ్లీ వరుస భాగస్వామ్యాలు నెలకొల్పుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే కోహ్లీ 186 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటై డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. కోహ్లీ 9వ వికెట్ రూపంలో వెనుదిరగ్గా, శ్రేయాస్ అయ్యర్ (అబ్సెంట్ హర్ట్) బ్యాటింగ్ కు దిగకపోవడంతో టీమిండియా ఆలౌట్ అయినట్టు ప్రకటించారు.

శుభ్ మల్ గిల్(128), అక్షర్ (79), శ్రీకర్ భరత్ (44), జడేజా (28) పరుగులతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం నాలుగో టెస్టు డ్రా దిశగా తీసుకెళ్తోంది. ఆసీస్ బౌలర్లలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లైయన్ 3, యువ ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 1, లెఫ్మార్మ్ స్పిన్నర్ కుహ్నెమన్ 1 వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 6 ఓవర్లలో కేవలం 3 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ ఎంతో ముందుజాగ్రత్తతో తమ స్పిన్నర్ కుహ్నెమన్ ను ఓపెనర్ గా బరిలో దింపింది. ప్రస్తుతం క్రీజులో కుహ్నెమన్ (0 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్ (3 బ్యాటింగ్) ఉన్నారు. 

Tags:    

Similar News