Virat Kohli: విండీస్‌తో తొలి వన్డే.. కోహ్లి అరుదైన రికార్డు

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌కు రాలేదు.

Update: 2023-07-28 12:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌కు రాలేదు. కానీ బ్యాటింగ్‌ రాకపోయినా కోహ్లి మాత్రం ఒక అరుదైన రికార్డు సాధించాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌ సమయంలో కోహ్లి స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన జడేజా బౌలింగ్‌లో నాలుగో బంతిని షెపర్డ్‌ ఆఫ్‌సైడ్‌ కవర్‌ డ్రైవ్‌ ఆడటానికి ప్రయత్నిచగా.. బంతి ఎడ్జ్‌ తీసుకుని స్లిప్స్‌ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో మొదటి స్లిప్‌లో ఉన్న కోహ్లి.. మెరుపు వేగంతో తన కుడివైపుకి డైవ్ చేసి సింగిల్‌ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ క్రమంలో కోహ్లి వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఆటగాళ్ల జాబితాలో రాస్‌ టేలర్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. కోహ్లి అందుకున్న షెపర్డ్‌ క్యాచ్‌ అతనికి 142వది. ఇక కోహ్లి కంటే ముందు టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ 156 క్యాచ్‌లతో మూడో స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌ 160 క్యాచ్‌లతో ఉన్నాడు. లంక దిగ్గజ ఆటగాడు మహేళ జయవర్దనే 218 క్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.



Similar News