కోహ్లీ భారీ సిక్సర్.. చెపాక్ స్టేడియంలో పగిలిన గోడ

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు.

Update: 2024-09-15 19:03 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. దాదాపు 8 నెలల తర్వాత తర్వాత అతను సుదీర్ఘ ఫార్మాట్ ఆడబోతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో పాల్గొన్న అతను ఆ తర్వాత టెస్టులు ఆడలేదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు అతను దూరంగా ఉన్నాడు. దీంతో బంగ్లాతో తొలి టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

చెన్నయ్‌లోని చెపాక్ స్టేడియంలో నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.పవర్‌ఫుల్ షాట్లు ఆడుతూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఆదివారం ప్రాక్టీస్‌లో భాగంగా కోహ్లీ ఓ బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. విరాట్ దెబ్బకు చెపాక్ స్టేడియంలోని గోడ బద్దలైంది. భారత డ్రెసింగ్ రూం దగ్గర ఉన్న గోడ‌కు రంధ్రం పడింది. కోహ్లీ ప్రాక్టీస్ వీడియోను జియో సినిమా సోషల్ మీడియాలో పోస్టు పెట్టగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. ‘కోహ్లీ ఆన్ ఫైర్, బంగ్లా బౌలర్లపై కూడా ఇలాగే రెచ్చిపోవాలి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు, బంగ్లాతో సిరీస్‌లో విరాట్ అరుదైన రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది. కోహ్లీ 27 వేల పరుగుల మైలురాయికి చేరువులో ఉన్నాడు. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో 591 ఇన్నింగ్స్‌ల్లో 26942 రన్స్ చేశాడు. ఇంకో 58 పరుగులు చేస్తే 27 వేల పరుగులు పూర్తి చేస్తాడు. ఈ క్రమంలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని సాధించిన బ్యాటర్‌గా, మొత్తంగా 4వ బ్యాటర్‌గా నిలుస్తాడు. 

Tags:    

Similar News